వైసీపీ మూడు రాజధానులపై వెనక్కి తగ్గుతుందా..?

P.Nishanth Kumar
వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గరినుంచి జగన్ సమర్ధవంతమైన పాలనా అందిస్తూ ముందుకు వెళ్తున్నాడు. అంతేకాదు సాహోసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో వైసీపీ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.. జగన్ అధికారంలో వచ్చిన తరువాత తీసుకున్న సంచలన నిర్ణయం అమరావతి ని కాదని  విశాఖ ను రాజధాని గా చేయడం.. ఈ విషయం పై జగన్ కు సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు వచ్చాయి. అయితే వాటిని అయన పట్టించుకోలేదు. తన దూకుడు స్వభావం తో నిర్ణయాన్ని ఏమాత్రం మార్చుకోలేదు. ఫలితంగా రాజధాని ఏర్పాటు జరుగుతుంది..

అయితే కొంతమంది ప్రతిపక్ష నేతలు ఓర్వలేని విధంగా చేస్తూ రాజధాని మార్పు విషయాన్నీ కోర్టు కు లాగారు.. దీంతో తీర్పు వస్తే గానీ రాజధాని మార్పు కుదరని పని.. అయితే కోర్టు లో పిటిషన్ ఇచ్చి చాల రోజులే అవుతున్నా ఈ విషయం ఇంతకీ తేలడం లేదు. దాంతో వైసీపీ లో నిరుత్సాహం పెరిగిపోయినాలు తెలుస్తుంది. మరోవైపు అమరావతి రైతుల ఉద్యమం ఇంతకీ ఆగడం లేదు. రోజు రోజు కు ప్రజల కోపం ఉధృతమవుతోంది. దాంతో వైసీపీ పై వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉండడంతో వైసీపీ ఈ విషయం పై తగ్గే ఆలోచన చేస్తుందని వార్తలు వస్తున్నాయి..

ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు దీనిపై స్పందిస్తూ మూడు రాజధానులపై తాము వెనక్కి తగ్గబోమని.. తమ విధానం అదేనని చెబుతున్నారు. విజయసాయిరెడ్డి దగ్గర్నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి వరకూ అదే చెబుతున్నారు.వారి విధానం మూడురాజధానులేనని ఏడాది కిందటే స్పష్టమయింది. కానీ ఒకే రాజధాని ఉండాలని ఇతర విపక్షాలు పోరాడుతున్నాయి. అది వేరే విషయం. వారి విధానం మూడు రాజధానులు కాబట్టే.. చట్టాలు చేసి.. న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని తెలిసినా… ముందుకెళ్తున్నారు.వాస్తవానికి మూడురాజధానుల అంశంపై గతంలో ఉన్న స్పీడ్ ఇప్పుడు ప్రభుత్వం చూపించడం లేదు. కొద్ది రోజుల కిందటి వరకూ.. ఏ క్షణమైనా ప్రభుత్వ యంత్రాంగం అంతా విజయవాడకు వెళ్తుందన్నట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి హడావుడి లేదు. ప్రకటనలు మాత్రం వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఆర్థిక సమస్యల్లో ఉండటం ఓ కారణం అయితే.. న్యాయపరమైన చిక్కులు మరో కారణం కావొచ్చంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: