రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు కాకుండా ఆపుతున్నదెవరు..?
వారిలో హనుమంత రావు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి లు తీవ్రంగా పోటీ పడుతున్నారు.. ముందునుంచి కాంగ్రెస్ లో వర్గ పోరు ఎక్కువ. ఒకరు ఎదుగుతుంటే ఇంకొకరు చూడలేరు. ఈ విషయాన్నీ పార్టీ నేతలు బహిర్గతం చేశారు. ఈనేపథ్యంలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీ లో చేరిన టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి పార్టీ లో , ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయనకు ఈ సరి టీపీసీసీ పదవి ఖాయం అనుకున్నారు. కానీ కొందరు రేవంత్ కి ఆ పదవి దక్కకుండా చేయాలనీ కుట్రలు పన్నుతున్నారట.
రేవంత్ పీసీసీ చీఫ్ అవ్వకుండా.. కాంగ్రెస్ హైకమాండ్‌పై అన్ని రకాల ఒత్తిళ్లు పెట్టేలా.. కొంత మంది చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే తెలంగాణ రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని పేర్ని నాని రేవంత్ అంశాన్నిప్రస్తావించారని అంటున్నారు. టీఆర్ఎస్ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న వైసీపీ నేతలు.. ఈ అంశంలో వారితో సమన్వయం చేసుకుంటున్నారని అంటున్నారు. పేర్ని నాని మాటలను.. వైసీపీ సోషల్ మీడియాకు చెందిన కొంత మంది వైరల్ చేశారు. ఉద్దేశపూర్వకంగా.. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినట్లుగా స్పష్టంగానే తెలుస్తోంది. ఇప్పటికే సొంత పార్టీ నేతలే కాదు.. ఇతర పార్టీల నుంచి కూడా.. రేవంత్ కు పదవి ఇవ్వొద్దని కాంగ్రెస్ హైకమాండ్‌పై ఒత్తిడిపెంచుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలిసిందో లేకపోతే.. రేవంత్ ను వ్యక్తిగతంగా విమర్శించారని ఫీలయ్యారేమో కానీ.. రేవంత్ రెడ్డి అభిమానుల పేరుతో కొంత మంది .. సోషల్ మీడియాలో పేర్ని నానిని బండ బూతులు తిడుతూ వీడియోలు అప్ లోడ్ చేయడం ప్రారంభించారు.