టీడీపీ మహిళా నాయకురాలితో ఏపీ మంత్రి వివాదం...!
వీరి పంచాయితీ కులాల చుట్టు తిరుగుతూ ఘర్షణలకు దారితీసింది. పలాస నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన టీడీపీ నాయకురాలు శిరీష అపజయం పాలైన సంగతి తెలిసిందే. అదే సమయంలో వైసీపీ తరపున పోటీ చేసిన సీదిరి అప్పలరాజు విజయం సొంతం చేసుకున్నారు. మొదట్లో వీరి మధ్య ఎటువంటి గొడవలు తలెత్తలేదు... ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయడం జరిగింది లేదు. అయితే కొన్ని రోజులుగా వీరి మధ్య కులాల పంచాయతీ మొదలైంది. కులాల పేర్లు చెప్పి ఒకరిపై ఒకరు విమర్శలు కుమ్మరించు కుంటున్నారు. మరోవైపు.... ఒకరిపై ఒకరు ఆధిక్యం సాధించేందుకు కులాల పేర్లను మధ్యలోకి లాగుతున్నారు అంటూ రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి.
టిడిపి నేత శిరీష భర్త యార్లగడ్డ వెంకన్న చౌదరి కావడంతో ఆమె కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలని సీదిరి అప్పలరాజు వర్గం ప్రచారాలు చేస్తూ ఎత్తి చూపుతోంది. కమ్మ భర్త ఉన్న శిరీష గౌతు లచ్చన్న వారసురాలు ఎలా అవుతుందని అప్పలరాజు అడుగుతున్నారు. దీనికి స్పందించిన శిరీష అప్పలరాజు వైఖరి పై మండి పడుతున్నారు. ఆ మాటకొస్తే ఆయన కళింగ సామాజకి వర్గానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నారు కనుక.. ఆయన కూడా గత ఎన్నికల్లో కళింగ వర్గం మద్దతుతో కూడా గెలిచారని… బహుశా ఆ విషయం మర్చిపోయారేమో అని.... ఆయనది మత్య్సకార వర్గం ఎలా అవుతారని శిరీష వర్గం కూడా ప్రత్యర్థిపై పెద్ద ఎత్తున ఎదురు ప్రచారం చేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే... ఈ వివాదంలో టీడీపీ కీలక నాయకులు, ఎంపీ కింజరపు రామ్మోహన్నాయుడు శిరీష కు మద్దతు పలకడంతో వివాదం కాస్త చర్చనీయాంశంగా మారింది. అటు పలు రాజకీయ వర్గాల నుండి ఇరు పార్టీ నాయకులు పరస్పర విమర్శలు జోరు తగ్గిస్తే ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని అభిప్రాయపడుతున్నారు.