ఏపీ ప్రభుత్వం : ఆన్ లైన్ కాల్ మనీ కేసులపై ఉక్కుపాదం...!
వీటిపై ప్రస్తుతం ఏపీ సీఎం చాలా సీరియస్ గా ఉన్నారు. దీనిపై వెంటనే విచారణ జరిపి దీని వెనుక ఎటువంటి వారు ఉన్నా శిక్షించాలని ఆదేశించారు. ఈ విధంగా చట్టానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టే వారిపై నిఘా పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. అటువంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలంటూ సూచించారు. ఆన్లైన్ కాల్ మనీ వ్యవహారాలపై దృష్టి పెట్టి ...ఆన్లైన్ కాల్ మనీ వేధింపులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆజ్ఞ జారీచేశారు ఏపీ సీఎం. తద్వారా అమాయకపు ప్రజలను టార్గెట్ చేసే మోసగాళ్లకు సరైన గుణపాఠం నేర్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్.
సీఎం ఆదేశాల మేరకు ...మొబైల్ లోన్ యాప్‌లపై రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లు చేపడుతున్నట్లు డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. ఏపీలో జల్లెడ పట్టి మరీ అటువంటి వారిని శిక్షిస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా మైక్రో ఫైనాన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించి నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు. ఇక మొబైల్ లోన్ యాప్‌ల మోసాల విషయానికొస్తే.... అటువంటి వారు మహిళల్నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్లు తెలియజేశారు. మొబైల్ లోన్ యాప్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు. త్వరలోనే ఇటువంటి అరాచకాలకు పాల్పడేవారిని గుర్తించి తగిన శిక్ష విధిస్తామని వెల్లడించారు.