హైదరాబాద్ లో మరో టేకి ఆత్మ హత్య.. కారణం అదే?

Satvika
చిన్న చిన్న విషయాలకు చనిపోవడం యువతకు ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయింది. కుటుంబాన్ని, మంచి భవిష్యత్ ను వదిలేసి ప్రాణాలను తీసుకుంటున్నారు.. హత్యలు, అత్యాచారాల వల్ల కొందరు ప్రశ్నలను తీసుకుంటే మరి కొంతమంది మాత్రం చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూసుకొని క్షణికావేశంలో చనిపోతున్నారు..ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.. ముఖ్యంగా ఆత్మ హత్యలు చేసుకొనే వాళ్ళు సాప్ట్ వేర్ ఉద్యోగులే కావడం గమనార్హం..

చిన్న విషయాలకు మోసపోయినట్లు భావించి నిండు నూరేళ్ళ జీవితాన్ని మొగ్గలోనే తుంచేసుకుంటున్నారు. అసలు విషయానికొస్తే.. ఇటీవల ఆన్ లైన్ మనీ యాప్ ల వల్ల చాలా మంది ప్రాణాలను కోల్పోయారు.. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారడంతో పాటుగా పోలీసులకు ఛాలెంజ్ గా మారింది. లోన్ యాప్ ల వేధింపులు భరించలేక తనువు చాలించిన వారు రోజు రోజుకు పెరుగుతున్నారు.. దీంతో ఆన్ లైన్ లోన్ యాప్ ల నిషేదం పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ఇలా ఉండగా ... ఇప్పుడు మరో యువ ఇంజనీర్ ఆత్మ హత్య నగరంలో కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో యువ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇరిగేషన్ ప్రాజెక్టులో సైట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వెంకట్ రావు గచ్చిబౌలిలోని తన హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దానికి ముందు తన అన్నకు వాట్సప్ మెసేజ్ చేశాడు. కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు మెసేజ్ పెట్టాడు. వెంటనే అనుమానం వచ్చిన వెంకట్ అన్న దీపక్.. పోలీసులకు సమాచారం చేరవేశాడు. పోలీసులు వెళ్లి చూసే లోగా జరుగ కూడని దారుణం అయితే జరిగిపోయింది.. అతను చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటన పై దర్యాప్తు చేస్తున్నారు.. అతని సూసైడ్ వెనుక ప్రేమ వ్యవహారం ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: