సరికొత్త డెబిట్ కార్డు.. ఉచితంగా 10 లక్షల బెనిఫిట్..?

praveen
ప్రస్తుతం ఎన్నో రకాల బ్యాంకులు బ్యాంకు కస్టమర్లకు ఎన్నో అధునాతనమైన సర్వీసులు అందిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు ఇప్పటికే ఎన్నో మెరుగైన సర్వీసులు అందిస్తోంది.  ఇతర బ్యాంకుల్లో ఉన్న పోటీని తట్టుకుంటూ ప్రస్తుతం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు అందిస్తున్న సేవలను రోజు రోజుకు మరింత మెరుగు పరుచుకుంటూ ముందుకు సాగుతోంది అన్న విషయం తెలిసిందే. కాగా  ఇటీవల సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు డెబిట్ కార్డులపై శుభవార్త చెప్పింది.



 తమ కస్టమర్లు  అందరికీ కూడా సరికొత్తగా డెబిట్ కార్డులు తీసుకువచ్చి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్సీపిఐ భాగస్వామ్యంతో ఈ డెబిట్ కార్డు ఆవిష్కరించిన తెలుస్తుంది. అయితే ఇది కాంటాక్ట్ లిస్ట్ డెబిట్ కార్డులు కావడం గమనార్హం. ఇటీవలే బ్యాంకు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ సరికొత్త కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డులను లాంచ్ చేసింది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కస్టమర్ లైఫ్ స్టైల్ ఫిట్నెస్ న్యూట్రిషన్ పర్సనల్ కేర్ లాంటి వాటి లక్ష్యం గా.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డులను తీసుకొచ్చినట్లు  తెలుస్తుంది. ఇక ప్రస్తుతం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న రూపే డెబిట్ కార్డు కలిగిన వారు ఉచితంగానే పలురకాల సర్వీసులు పొందేందుకు అవకాశం కూడా ఉంటుంది.



 ఇక ఈ సరికొత్త కాంటాక్ట్ లెస్  రూపే డెబిట్ కార్డు ద్వారా ప్రత్యేకమైన సర్వీసులు పొందేందుకు అవకాశం ఉంది.  అంతేకాదు డెబిట్ కార్డు ద్వారా  హెల్త్ చెకప్ పేమెంట్ జరిపితే భారీగా డిస్కౌంట్లు పొందేందుకు అవకాశం కూడా ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 110 పౌండేషన్ డే సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్టులను తమ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. అంతే కాకుండా ఎలాంటి అదనపు తనిఖీలు లేకుండానే పది లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా డెబిట్ కార్డు కలిగిన కస్టమర్లకు లభిస్తుందని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: