తాడిపత్రిలో మొదలయిన కాక జేసీ వర్సెస్ ఎమ్మెల్యే కేతిరెడ్డి
సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు పోలీస్ లు ఎంత ప్రయత్నించినా ఎవరు వెనక్కి తగ్గకుండా ,ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే స్వయంగా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డి తన అనుచరులతో కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి చేసి, ఆయన అనుచరుడైన కిరణ్ అనే వ్యక్తి పై దాడి కి దిగినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం స్థానికంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ వార్త తెలిసిన వెంటనే హైదరాబాదులో ఉన్నా జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి కి బయలుదేరినట్లు సమాచారం. ఈ వ్యవహారం తో వాతావరణం వేడెక్కడం తోపాటు, దాడులు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.
ఇప్పుడు తాడిపత్రిలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కాగా ఈ వ్యవహారంపై జేసీ వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.