ట్రంప్ కి రివర్స్ గా జో బిడెన్.. లెక్క తప్పుద్దా..?
దీనికి సజీవ మైనటువంటి సాక్ష్యం అమెరికా అనే చెప్పాలి. అమెరికాలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికలలో అంతకు ముందు ఉన్న అధ్యక్షుడుపై బిడెన్ విజయం సాధించారు. జో బిడెన్ వచ్చిన తర్వాత పాలనలో పూర్తిగా మార్పులు తీసుకుస్తున్నారు. ముఖ్యంగా డ్రగ్ మాఫియాకు కేరాఫ్ అడ్రస్ అయిన మెక్సికో సిటీలో ఎంతో మంది పై నిబంధనలు పెట్టడం లాంటివి చేసారు డోనాల్డ్ ట్రంప్. కానీ ఇప్పుడు బిడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూటు మార్చేశారు.
ఇటీవలే మెక్సికో ప్రెసిడెంట్ తో సమావేశమైన అమెరికా అధ్యక్షుడు బిడెన్.. కీలక చర్చలు జరిపారు. ఇక మెక్సికోలో అందరూ ఇష్టమైన కార్యకలాపాలు చేసుకోవచ్చని అందరికీ మానవతా దృక్పథంతో అవకాశం కల్పిస్తాము అంటూ జో్ బిడెన్ తెలిపారు. అయితే ఇటీవలే బిడెన్ తీసుకున్న నిర్ణయం అమెరికా యొక్క ప్రయోజనాల కంటే వ్యక్తిగత ఈగో ని సంతృప్తి పరుచుకోవడం కోసమే అన్నట్లుగా ఉంది అని విశ్లేషకులు అంటున్నారు ఇక నిర్ణయంతో అరాచక శక్తులు రెచ్చిపోయే అవకాశం ఉందని అంటున్నారు. జో బిడెన్ నిర్ణయంతో మరోసారి డ్రగ్స్ మాఫియా రెచ్చిపోయే అవకాశం ఉందని ఈ క్రమంలోనే మెక్సికోలో దారుణ పరిస్థితి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఏం జరుగుతుందో చూడాలి మరి