పండగ సీజన్ లలో బ్రేకరి వాళ్ళు కొత్త కళలకు శ్రీకారం చుడతారు. ఈ మేరకు కొత్త రకాల భారీ కేకులను తయారు చేస్తారు..వస్తువుల రూపంలో అయిన లేదా ఫేమస్ మనుషుల రూపంలో అయిన కేకులు తయారు చేసి ప్రదర్శిస్తారు. ఇలాంటి ప్రత్యేకమైన కేకులను తయారు చేయడంలో తమిళనాడు ముందు ఉంటుంది.. ఈ మధ్య తమిళనాడు బేకరీలు కొత్త రకం కేకులు తయారు చేస్తూ చూపరులను అమితంగా ఆకట్టుకుంటున్నారు.. ఇప్పుడు మరోసారి ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నారు..తమిళనాడులోని రామనాథపురం పట్టణంలో ఉన్న ఓ బేకరీ యాజమన్యాం..
అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు డీగో మారడోనా అంటే ఎంత ఇష్టమో .. కేకు రూపంలో ప్రదర్శించారు.
ఇటీవల నవంబర్ 25 న కన్నుమూసిన డీగో మారడోనా ప్రపంచ మేటి ఫుట్‌బాల్ ఆటగాడిగా ఎందరో మనసుల్ని దోచుకున్నారు. చివరి శ్వాస వరకు ఫుట్‌బాలే జీవితంగా బ్రతికిన మారడోనాను ఎక్కువగా ప్రేమించే రామనాథపురం పట్టణంలోని
ఐశ్వర్య బేకరీ యజమాని సతీశ్ రంగనాథన్.. తన అభిమానాన్ని నిలువెత్తు కేకు రూపంలో ప్రదర్శించాడు.ఈ మేరకు ఆరు అడుగుల కేకును తయారు చేసి దుకాణం ఎదుట ప్రదర్శించారు. ఆ కేకును తయారు చేయడానికి నాలుగు రోజులు సమయం పట్టిందట..60 కిలోల చక్కెర, 270 గుడ్లను వాడారట..
ఎక్కడో ఆటను ఆడటం కాదు..మైదానంలో ఆడాలని యువతను కోరడానికి మేం ఈ విగ్రహాన్ని తయారు చేసాం అని బేకరీ యజమాని సతీశ్ రంగనాథన్ చెప్పారు.
సచిన్ టెండూల్కర్, ఉసేన్ బోల్ట్,
మైక్ టైసన్ మాదిరిగానే మారడోనా కూడా ఆయన క్రీడలో గుర్తుకు వస్తారని ఆయనన్నారు.ప్రతి
క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకలను ఇలాంటి రుచికరమైన క్రియేషన్స్ చేయడానికి రామనాథపురం బేకరీ ప్రసిద్ధి చెందింది. ఇంతకుముందు ఈ బేకరీ యాజమన్యాం ప్రసిద్ధ స్వరకర్త ఇలయరాజా, ఏపీజే అబ్దుల్ కలాం, ప్రఖ్యాత
తమిళ కవి భారతీయార్ కేక్ విగ్రహాలను తయారు చేసి ప్రదర్శించారు. ఆ కేకు లు జనాలను విపరీతంగా ఆకట్టుకోవడంతనే పాటుగా సోషల్
మీడియా లో వైరల్ అయ్యాయి..