తిరుపతి ఉప ఎన్నికపై కీలక వ్యాఖ్యలు చేసిన వై వి సుబ్బారెడ్డి...!

VAMSI
తిరుపతి బై ఎలక్షన్స్ లో కీలకమైన అంశాలను గురించి  చర్చిస్తూ బేటీ నిర్వహించారు వైసిపి ప్రముఖులు. ఈ సమావేశంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా పాల్గొనడం విశేషం. ఈ భేటీలో పార్టీ నడిపించాల్సిన తదుపరి కార్యక్రమాల గురించి, అలాగే రాబోయే తిరుపతి ఉప ఎన్నికల గురించి చర్చ జరిగింది. ఈ భేటీలో వైసీపీ నేతలు భూమన కరుణాకర రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి, ద్వారకనాధ రెడ్డి, శ్రీనివాసులు, ఎంఎస్ బాబు, వెంకటేష్ గౌడ్, ఎంపీ రెడ్డెప్పలు పాల్గొన్నారు. పలు ప్రధాన అంశాల చర్చ కొరకు వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా ఇంచార్జీ వైవీ సుబ్బారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు.

ఈ సమావేశం లో ముఖ్యంగా ‘తిరుపతి బై ఎలక్షన్‌పై చర్చించాము. అందరూ తమ తమ అభిప్రాయాలను తెలుపుతూ సమాలోచన చేశారు. వైసీపీ పార్టీ ఏమి చేసినా... ప్రజల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని చేస్తుంది. కానీ జగన్ సర్కారు పాలనలో ఉన్న ప్రజలు... శరవేగంగా అభివృద్ధి  వైపుకు దూసుకుపోతుంటే.... ప్రతిపక్షాలు ఓర్వ లేక అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి సహించలేని ప్రతిపక్షాలు.. అన్నింటికీ అడ్డుపడుతూ తమ స్వార్థాన్ని చాటుకుంటున్నాయి అన్నారు సుబ్బారెడ్డి. ఇది అటుంచితే తిరుపతి బై ఎలక్షన్‌ పై లోతుగా చర్చించడం జరిగింది... త్వరలోనే మా అభ్యర్థి ఎవరన్నది అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.

అన్ని రకాలుగా అర్హత  కలిగిన నాయకుడినే వైసిపి తమ అభ్యర్థిగా ఎంపిక చేస్తుందని గుర్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి మాత్రమే మేము ప్రచారం చేస్తాం. గత ఎన్నికలలో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ ఫలితాలు సాధిస్తామని నమ్మకముంది అని మీడియా ముఖంగా తెలిపారు వై వి సుబ్బారెడ్డి. కాగా ఈ రోజు చిత్తూర్ జిల్లాకు విచ్చేయుచున్నసీఎం జగన్ తిరుపతి ఎంపీ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటిస్తారా అనే అనుమానాలు ఉన్నాయి. మరి ఏమి జరగనుందో వేచి చూద్దాం....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: