సైబర్ నేరస్థుల కొత్త టెక్నిక్ ... తస్మాత్ జాగ్రత్త.!?

praveen
సాంకేతికత పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్ మోసాలూ ఎక్కువవుతున్నాయి. ఒకప్పడు దీనికి అమాయక, నిరక్షరాస్య ప్రజలు మాత్రమే బలయ్యే వారు. కానీ ఇప్పుడు అన్నీ తెలిసిన వారు కూడా బురిడీ గాళ్ల మాయలో చిక్కుకుంటున్నారు. ఆన్లైన్లో ఇలాంటి మోసాలు వేల సంఖ్యలో చోటు చేసుకుంటున్నాయి. వీటిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. ఎవరైనా దగ్గరి బంధువులు, స్నేహితులు మిమ్మల్ని సామాజిక మాధ్యమాల్లో డబ్బు అడినప్పుడు అది నిజమా కాదా అనేది నిర్ధారించుకోవాలి.

 గత ఆరు నెలల్లో ఇలాంటి మోసాలు బాగా పెరిగాయి. మొదట్లో దుండగులు ఫేస్బుక్ ఖాతాల ను హ్యాక్ చేసి, వారి స్నేహుతుల ను డబ్బు అడిగేవారు. అన్ని సందర్భాల్లో ఇది ఫలితాల ను ఇవ్వకపోవడం తో వారి ఫోటోలు, ఇతర వ్యక్తిగత వివరాల ను ఉపయోగించి ప్రజా కార్య క్రమాల పేరిట డబ్బు వసూలు చేయడం మొదలు పెట్టారు. ఇలాంటి వారు సినీ తారలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, పోలీసుల అకౌంట్లను క్లీన్ చేశారు .

డబ్బులు కావాలని పోస్టులు పెడతారు. ఈ విషయాలు తెలియక స్పందించిన వారు మోస పోతున్నారు. ఇలాంటి ఆన్లైన్ మోసాలు ఫేస్బుక్కు మాత్రమే పరిమితం కాలేదు. గతం లో వాట్సాప్, ఓఎల్ఎక్స్ ద్వారా సైబర్ నేరస్థుల చేతిలో ప్రజలు మోసపోయినట్లు అనేక కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు మళ్ళి స్టైల్ మార్చారు. సీజనల్ వ్యాపారాల్లాగా, సీజనల్ మోసాల కు పాల్పడుతున్నారు. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ట్రెండింగ్‌ లో ఉండటంతో జనాన్ని ఈజీగా నమ్మించేలా ప్లాన్ చేశారు. టీకా రిజిస్ట్రేషన్ చేస్తామంటూ ఫోన్లు చేస్తున్నారు. కరోనా టీకా కోసం ఫోన్‌లో ఆధార్, ఓటీపీ నెంబర్లు  అడుగుతున్నారు. దీంతో అలర్ట్ అయిన ఏపీ పోలీసులు ఇలాంటి వారిని అసలు నమ్మొద్దని సూచించారు.కరోనా వ్యాక్సిన్ పేరుతో ఎవరైనా ఓటీపీలు, ఆధార్ నెంబర్ అడిగితే ఇవ్వొద్దని సూచిస్తున్నారు. ...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: