కోతుల కోసం ఎలుగుబంటిని తీసుకువచ్చారు.. సర్పంచ్ వినూత్న ఆలోచన..?

praveen
ఈ మధ్య కాలంలో గ్రామాల్లో కోతుల బెడద రోజురోజుకూ ఎక్కువ అవుతుంది అన్న విషయం తెలిసిందే గుంపులు గుంపులు గా వస్తున్న కోతుల ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గుంపులు గుంపులు గా వస్తున్న కోతులు ఏకంగా ప్రజల పై దాడులకు సైతం పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.  ఈ మధ్యకాలంలో అడవుల నరికివేత.. అంతేకాకుండా అడవుల్లో గతంలో లాగా ఎలాంటి ఫలాలు లభించకపోవడంతో కోతులన్నీ ప్రస్తుతం గ్రామాల బాట పడుతున్నాయి.

 జనావాసాల్లోకి వస్తు ఏదైనా ఆహారం దొరుకుతుందో ఏమో అని తిరుగుతున్నాయి కోతులు గుంపులు.  ఇక కోతుల గుంపు లు వచ్చి రోజురోజుకూ తిరుగుతున్న కారణంగా ఎన్నో ఇల్లు స్వల్పంగా ధ్వంసం అవుతుండగా మరో వైపు అటు రైతులు కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. చేతికి వచ్చిన పంట లో కోతుల గుంపు చేరి చివరికి తీవ్ర స్థాయిలో నష్టం కలిగిస్తోంది.  అయితే కోతుల గుంపు తరిమి కొట్టడానికి అటు రైతులు గ్రామస్తులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి విఫలంగానే మారిపోతున్నాయి.  ఈ క్రమంలోనే ప్రస్తుతం కోతుల గుంపును తరమడానికి వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది.

 ఇక్కడ ఇలాంటిదే చేసారు. గ్రామం లో కోతుల బెడద ప్రధాన సమస్యగా మారిపోయింది.  ఎన్నిసార్లు కోతుల గుంపు లను తరిమి కొట్టిన ప్పటికీ మళ్లీమళ్లీ గ్రామంలోకి వస్తున్నాయి ఈ క్రమంలోనే గ్రామ సర్పంచ్ వినూత్నంగా ఆలోచించాడు.  తెలంగాణ రాష్ట్రం లోని నల్గొండ జిల్లాలోని దేవుల పల్లి గ్రామంలో ఇబ్బందులకు గురి చేస్తున్న కోతుల గుంపును ఊరు నుంచి వెళ్లగొట్టడమే  లక్ష్యంగా ఎలుగు బంటుని  తెరమీదికి తెచ్చాడు. పంచాయతీ సిబ్బంది ప్రస్తుతం ఎలుగుబంటి వేషం వేసారు. ఈ క్రమంలోనే కోతులు ఆ ఎలుగుబంటి వేశాన్ని చూసి బయటికి పరుగులు పెడుతున్నాయి. అయితే సర్పంచ్ బాల రాణి రాజాసింగ్ వినూత్న ఆలోచనలు పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: