ఇల్లాలి బెడ్ రూమ్ నుంచి ప్రియురాలి బెడ్ రూమ్ కి సొరంగం.. చివరికి ఓ రోజు ఏం జరిగిందంటే..?

praveen
ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనే సినిమా అందరూ చూసే ఉంటారు. సినిమా లో ఓ  వైపు భార్యకు తెలియకుండా ప్రియురాలిని కలవడం ప్రియురాలికి తెలియకుండా భార్య ను కలవడం లాంటివి చేస్తూ ఉంటాడు వెంకటేష్.  ఎన్నో తిప్పలు పడుతూ ఉంటాడు.ఎక్కడ ఇలాంటిదే జరిగింది... ఇంట్లో ఇల్లాలు కి తెలియకుండా పక్క ఇంట్లో ఉన్న ప్రియురాలి భర్తకు తెలియకుండా ఓ సరికొత్త ప్లాన్ వేశాడు ఇక్కడ ఒక వ్యక్తి. అతని తెలివి చూసి అందరూ అవాక్కయ్యారు.  తన ఇంటి నుంచి ప్రియురాలి ఇంటికి సొరంగం తవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.



 అయితే ఎంతో కష్టపడి ప్రియురాలిని కలిసేందుకు సొరంగం తవ్వినప్పటికీ అతని ఆటలు ఎంతో కాలం సాగలేదు. ఈ ఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. ఆల్బెర్టో  అనే వ్యక్తి తన ఇంట్లో ఉన్న బెడ్ రూమ్ నుంచి పొరుగింట్లో ఉన్న ప్రియురాలు ఇంట్లో వరకు ఒక పెద్ద సొరంగం తవ్వాడు. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ప్రియురాలి భర్త నైట్ డ్యూటీ కి వెళ్ళిన సమయంలో సొరంగం ద్వారా ప్రియురాలి ఇంట్లోకి వెళ్లి రాసలీలలు కొనసాగిస్తూ ఉండేవాడు. ఓ  రోజు నైట్ డ్యూటీ చేస్తూ సగంలో ఇంటికి వచ్చిన భర్తకు వీరి  రాసలీలలు కాస్త తెలిసిపోయాయి. సొరంగం ఎక్కడ ఉందో కూడా తెలిసిపోయింది.


 సొరంగం ఎక్కడికి వెళ్తుందో అని సదరు వ్యక్తి చెక్ చేయగా ఆల్బర్ట్ ఇంటి లోపలికి వెళ్ళింది. ఆ తర్వాత ఇక మొత్తం విషయం బయటపడింది. దీంతో చిర్రెత్తిన పోయిన ప్రియురాలి భర్త ఆల్బర్ట్ ను  చితక్కొట్టుడు కొట్టాడు. విషయం పోలీసుల వరకూ వెళ్లింది. పోలీసులు వచ్చి కు ఆ సొరంగాన్ని చూసి షాక్ అయ్యారు. ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది ఏదేమైనా ప్రియురాలిని కలిసేందుకు ఎంతో కష్టపడి సొరంగం తోవ్వాడు అంటే అతడు ఘనుడు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: