2020 హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ : ఈ ఏడాదిలోజరిగిన టాప్ 10 హైలైట్స్ ఇవే..!?

N.ANJI
2020 సంవత్సరం చూస్తుండగానే గడిచిపోయింది. ఈ ఏడాది మొత్తం కరోనా, లాక్ డౌన్ తోనే గడిచిపోయింది. కరోనా వైరస్ తరువాతి స్థానంలో ఎన్నికలు, అయోధ్యా రామ మందిరం వంటి అంశాలు బాగా ట్రెండింగ్ గా నిలిచాయి. ఇంతకీ మనదేశంలో, ప్రపంచంలో జరిగిన అతిపెద్ద సంఘటనల వివరాలేంటో ఒకసారి తెలుసుకుందామా.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలానియాతో కలిసి భారత్ లో పర్యటించారు. అహ్మదాబాద్ లో 60వేల మందితో ఏర్పాటు చేసిన 'నమస్తే ట్రంప్' అనే అతిపెద్ద బహిరంగ సభలో ట్రంప్ పాల్గొన్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంతగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
అయితే ప్రపంచవ్యాప్తంగా కనీసం 1,616,1919 మందిని పొట్టన పెట్టుకున్న కరోనా 2020లో హెడ్ లైన్స్ లో నిలిచింది. నిజానికి 2వ ప్రపంచ యుద్ధం తరువాత ఈ స్థాయిలో వరల్డ్ హెడ్ లైన్స్ లో నిలిచిన అంశం కోవిడ్-19 ఒక్కటే. నేషనల్ డెమాక్రటిక్ అలయెన్స్ విజయం సాధించిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి.చివరికి ఈ ఎన్నికల్లో జేడీయూ విజయం సాధించగా మరోమారు నితీష్ కుమార్ సీఎంగా అధికారం చేపట్టారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయగా అపురూప ఘట్టానికి నాంది పలికినట్టైంది. దశాబ్దాలుగా హిందువుల స్వప్నంగా మిగిలిపోయిన అయోధ్య లో రామ మందిర నిర్మాణం సాకారం అయ్యే వేళ సమీపించటంతో ఆగష్టు 5వ తేదీన మోదీ చేతుల మీదుగా సాగిన భూమి పూజ హైలైట్ గా సాగింది.  బాబ్రీ మసీదు కూల్చివేత కుట్ర కాదని, కూల్చివేతకు సరైనా సాక్ష్యాధారాలు లేవంటూ వెలువడిన తీర్పు సంచలనం సృష్టించింది.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా మరోమారు అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికయ్యారు. దీంతో రామ్ లీలా మైదానంలో 3వ సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కేజ్రీవాల్ హస్తిన రాజకీయాల్లో తనకు తిరుగులేదని చాటుకున్నారు.  ఇక కొత్త వ్యవసాయ సంస్కరణల చట్టాల రద్దుపై రైతు సంఘాలు చేస్తున్న పోరాటం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. దేశ రాజధాని ఢిల్లీ రోడ్లపై బైఠాయిస్తూ, అక్కడే వండుకుంటూ రైతులు చేపట్టిన భారీ నిరసన కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి.
పౌరసత్వ చట్టంపై మనదేశంలో భారీస్థాయిలో నిరసనలు చోటుచేసుకున్నాయి. కొన్ని నెలలపాటు మనదేశంలో నిరసనలు జరిగినప్పటికీ కేంద్రం పెద్దగా స్పందించలేదు. హాంకాంగ్ లో కొత్త జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేయటానికి చైనా చేసిన ప్రయత్నాలపై అగ్గిరాజుకుంది. చైనా ప్రణాళికలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన నిరసనకారులు ఇది తమ స్వయం ప్రతిపత్తి మీద జరుగుతున్న మూకుమ్మడి దాడిగా పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్తపై కార్టూన్ల ను ప్రచురించి ఉగ్రవాదుల దాడికి బలైన చార్లీ హెబ్డో పత్రిక మరోమారు తాము వివాదాస్పద కార్టూన్లను ముద్రిస్తామని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: