హత్య కేసులో కొత్త ట్విస్ట్.. అంతా మంగళసూత్రం కోసమే..?
అయితే ఈనెల 25వ తేదీన పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్నా సదరు మహిళ పై కన్నేసిన రాము అనే వ్యక్తి.. ఇంటి దగ్గర దిగాబెడతాను అంటూ మాయ మాటలు చెప్పాడు. అతని మాటలు నమ్మిన సదరు మహిళ చివరికి అతని వాహనం పై ఎక్కింది. ఇక ఈ క్రమం లోనే నిర్మానుష్య ప్రాంతం లో కి బైక్ తీసుకెళ్ళిన రాము అనే వ్యక్తి మహిళ మెడలో ఉన్న మంగళసూత్రం ఇవ్వాలి అంటూ మహిళను బెదిరింపులకు పాల్పడ్డాడు. కానీ మంగళసూత్రం ఇచ్చేందుకు సదరు మహిళ నిరాకరించింది.
ఈ క్రమంలోనే ఆమె పై కన్నేసిన రాము ఇక బలవంతంగా ఆమెపై అత్యాచారం చేయడంతో పాటు బండరాయితో ఆమె తలపై మోదాడు. ఆ తర్వాత చనిపోయిందని భావించి అక్కడి నుంచి మంగళసూత్రం లాక్కొని పరారయ్యాడు. ఈ క్రమంలోనే అపస్మారక స్థితి నుంచి తేరుకున్న బాధితురాలు మరుసటిరోజు పోలీస్ స్టేషన్కు చేరుకుని పోలీసులకు జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. పోలీసులు రామును అరెస్టుచేసి విచారణ జరిపారు. ఇక పోలీసు విచారణలో రాము అన్ని నిజాలను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.