అదిరిపోయే బిజినెస్ ఆఫర్.. 5 వేల పెట్టుబడితో.. ఎంత ఆదాయమో తెలుసా..?
ముఖ్యంగా దేశం లోని అన్ని రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు ఎయిర్పోర్టు లో కూడా మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యం లో అటు కేంద్ర ప్రభుత్వం కూడా కూల్హాద్ బిజినెస్ చేయాలి అనుకున్న వారిని ప్రోత్సహించేందుకు సిద్ధమయ్యారు. గతం లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్లాస్టిక్ పేపర్ కప్స్ లో టీ ఇవ్వడాన్ని బ్యాన్ చేయాలంటూ ఒక ప్రతిపాదన తెరమీదకు వచ్చారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కూల్హాద్ ను ప్రమోట్ చేయాలని కోరారు.
ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం పాటరీ ఎంపర్మెంట్ స్కీమ్ ను ప్రస్తుతం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం మట్టి పాత్రల తయారికి ఎలక్ట్రిక్ మిషన్ ను అందిస్తుంది. ఎలక్ట్రిక్ మిషన్ ద్వారా మట్టి పాత్రలు తయారు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇక ఈ మట్టి పాత్రలు తయారు చేసిన తర్వాత వీటిని ఎవరు కొంటారు అని అంటారా.. అలాంటి చింత అవసరం లేదు. ఎందుకంటే మట్టి పాత్రలు తయారు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వమే మట్టిపాత్రలను కొనుగోలు చేస్తుంది. ఇక ఈ బిజినెస్ చాలా తక్కువ ధరకే స్టార్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఐదు వేల పెట్టుబడితో ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇక ఈ బిజినెస్ చేస్తే రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించేందుకు అవకాశం ఉంటుంది.