ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తున్న ఏకశిల... భారత్ లో కూడా ప్రత్యక్షం
ఆ శిలపై ఏవో కొన్ని అంకెలు, త్రికోణాకార గుర్తులు ఉండటాన్ని అధికారులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 30 నగరాల్లో ఇదే తరహా ఏకశిలలు ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఇవి అంతుచిక్కని రహస్యంగానే ఉన్నాయి. ఈ వింత శిల గురించి తెలియడంతో జనాలు అక్కడకు చేరుకుని ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ ఏకశిల తొలిసారి అమెరికాలో ప్రత్యక్షమయ్యింది. తర్వాత కొద్ది రోజులకు మాయమయ్యింది. తర్వాత రొమేనియా, ఫ్రాన్స్, పోలెండ్, యూకే, కొలంబియాలోనూ ఇటువంటి ఏకశిల దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని సింఫనీ పార్క్‌ను ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. మున్సిపల్ కార్పొరేషన్‌కు కానీ, ప్రయివేట్ సంస్థకు కానీ ఈ నిర్మాణం మూలాలు గురించి ఇంత వరకు తెలియదు. కానీ, మున్సిపల్ కార్పొరేషన్ హార్టికల్చర్ విభాగం డైరెక్టర్ జిగ్నేశ్ పటేల్ మాట్లాడుతూ.. ఈ ఏకశిలాను పార్కును సందర్శించే వ్యక్తుల కోసం సింఫనీ లిమిటెడ్ ఏర్పాటు చేసిందన్నారు. ప్రజలు దాని మెరిసే ఉపరితలం ప్రతిబింబాన్ని చూడవచ్చు.. దానితో సెల్ఫీ తీసుకోవచ్చు అని పేర్కొన్నారు.