వంగ‌వీటి కొత్త రాజ‌కీయం... ఈ ప్లాన్ అయినా స‌క్సెస్ అవుతుందా...!

VUYYURU SUBHASH
దివంగ‌త కాపు నేత వంగ‌వీటి మోహ‌న‌రంగా రాజ‌కీయ వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన వంగ‌వీటి రాధా అతి  చిన్న వ‌య‌స్సులోనే కేవ‌లం 26 ఏళ్ల‌కే విజ‌య‌వాడ నుంచి కాంగ్రెస్ త‌ర‌పున ఎమ్మెల్యే అయ్యారు. అయితే 2009 ఎన్నిక‌ల వేళ నాటి సీఎం వైఎస్ వ‌ద్ద‌ని చెపుతున్నా కూడా పార్టీ మారిపోయారు. వైఎస్ పార్టీ మార‌వ‌ద్దు.. మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పినా కూడా రంగా విన‌లేదు. ఆ త‌ర్వాత వైసీపీలోకి వ‌చ్చి ఓడిపోయాక యాక్టివ్‌గా ఉండ‌డం లేద‌ని జ‌గ‌న్ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌ల నుంచి కూడా రాధాను త‌ప్పించ‌డంతో పాటు ఘోరంగా అవ‌మానించారు.

చేస్తే తూర్పులో పోటీ చేయ్‌.. లేక‌పోతే బంద‌రు పార్లమెంటుకు పోటీ చేయ‌మ‌ని చెప్ప‌డంతో రాధా ఏం చేయ‌లేక చివ‌ర‌కు గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆ ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్ర‌చారం కూడా చేశారు. టీడీపీ ఓడిపోవ‌డంతో రాధా రాజ‌కీయ భ‌విష్య‌త్తు గంద‌ర‌గోళ‌మైంది. గ‌త ఎన్నిక‌ల్లో తాను చేరిన టీడీపీ ఓడిపోయాక కూడా రాధా మ‌ళ్లీ జ‌న‌సేన లేదా బీజేపీలోకి వెళ‌తార‌న్న ప్ర‌చార‌మూ ఎక్కువ‌గానే ఉంది.

అయితే ఇప్ప‌టికే ప‌లు పార్టీలు మారిన రాధా ఇప్పుడు పార్టీ మార‌కూడ‌ద‌ని బ‌లంగా నిర్ణ‌యించుకున్నార‌ట‌. 2019 ఎన్నిక‌ల త‌ర్వాత రాధాకు స‌న్నిహితుడు అయిన మంత్రి కొడాలి నాని రాధాను వైసీపీలోకి తీసుకు వెళ్లేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసినా రాధా మాత్రం అందుకు అంగీక‌రించ‌లేద‌ట‌. అటు టీడీపీ అధి నాయ‌క‌త్వం కూడా రాధాకు ప్ర‌యార్టీ ఇస్తూ ఆయ‌న్ను రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కోసం మ‌రింత‌గా వాడుకోవాల‌ని డిసైడ్ అయ్యింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో రాధా పార్టీ మారేందుకు సుముఖంగా లేర‌ని తెలుస్తోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత టీడీపీ ఎప్పుడూ గెలిచినా రాధాకు మంచి ప్ర‌యార్టీయే ఉంటుంది. ఇటు టీడీపీ యువ‌నేత లోకేశ్ సైతం మంచి గుర్తింపు ఇస్తున్నారు. ఇప్ప‌టిక‌ప్పుడు వైసీపీ లేదా మ‌రో పార్టీలోకి వెళ్లినా రాధాకు ఇంత గౌర‌వం అయితే ఖ‌చ్చితంగా ఉండ‌దు. అందుకే రాధా త‌న గ‌త జంపింగ్ రాజ‌కీయాల‌కు భిన్నంగా ఈ సారి కొత్త పంథాతో ముందుకు వెళ్లాల‌నే నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఇది అయినా ఆయ‌న‌కు స‌క్సెస్ ఇస్తుందేమో ?  చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: