చైనా కు ఊహించని దెబ్బ.. కంపెనీలన్నీ మటాష్.. ఆశలన్నీ అతనిపైనే.?

praveen
ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగాలని ప్రస్తుతం చైనా భావిస్తుంది అనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతో బలమైన ఆర్థికశక్తిగా ఉన్న అమెరికాను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలవాలని అనుకుంది చైనా. దీనికోసం చైనా చేయని ప్రయత్నాలు లేవు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే అమెరికాను వెనక్కినెట్టి శక్తివంతమైన ఆర్థిక శక్తిగా మార్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది చైనా. కరోనా వైరస్ ను కూడా పుట్టించింది.



 ఇక ప్రస్తుతం కరోనా  వైరస్ టైంలో ప్రపంచ దేశాలు సంక్షోభంలో కూరుకు పోతున్న సమయంలో చైనా ఆర్థికంగా ఎంతగానో ఎదగాలని  ప్లాన్ చేసింది కానీ ప్రస్తుతం చైనా కు  ప్రపంచ దేశాలు వరుసగా షాకులు  ఇస్తూ వస్తున్నాయి అనే విషయం తెలిసిందే. సరిహద్దుల్లో  తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా మొదట భారత్ చైనా కు షాక్ ఇచ్చి భారత్లో ఉన్న పలు రకాల కంపెనీలను కాంట్రాక్టులను రద్దు చేయడంతో పాటు..  అన్ని రకాల యాప్స్ పై నిషేధం కూడా విధించింది అన్న విషయం తెలిసిందే. ఇక కేవలం భారత్ మాత్రమే ఇలా చేసింది అనుకుంటే ప్రస్తుతం ప్రపంచ దేశాలు కూడా ఇలాంటి తరహా వ్యూహాలు అమలు చేస్తున్నాయి.




 ప్రస్తుతం వరుసగా చైనాకు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అమెరికా లో చైనా కు సంబంధించిన యాప్స్ అన్నింటిని తీసి పడేస్తారు. అంతేకాకుండా చైనా మొబైల్ చైనా టెలికామ్ చైనా యూనికాన్ లను న్యూయార్క్ ఎక్స్చేంజి తమ లిస్టు నుంచి తొలగించడం తో చైనా కు మరో భారీ షాక్ తగిలింది. చైనాకు చెందిన దిగ్గజ సంస్థ ఆలీబాబా ను  తమకి తామే నాశనం చేసుకున్న చైనా ఇక ఇప్పుడు న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిర్ణయం తో తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది తెలుస్తుంది. దీంతో జో  బిడెన్  వచ్చిన తర్వాత ఆదుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: