వీర విహారం చేసిన కరోనా.. ఆ ఒక్క హోటల్ లోనే ఎన్ని కేసులో తెలుసా..?
ఇటీవలే చెన్నై నగరంలోని ఓ స్టార్ హోటల్ లో భారీగా కరోనా వైరస్ కేసులు బయటపడడం కలకలం సృష్టిస్తోంది. తమ హోటల్కు వచ్చే కస్టమర్ల విషయంలో ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన హోటల్ సిబ్బంది చివరికి నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగానే ప్రస్తుతంఈ హోటల్లో భారీగా కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి అని అందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై నగరంలో ఉన్న ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్ కరోనా హాట్ స్పాట్ గా మారినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ హోటల్ లో పనిచేసే సిబ్బందికి ఏకంగా 85 మందికి కరోనా పాజిటివ్ అని రావడం అందరిని ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది.
ముఖ్యంగా హోటల్లో పనిచేసే 609 మంది సిబ్బందికి కరుణ నిర్ధారిత పరీక్షలు చేయగా 85 మంది కి పాజిటివ్ అని వచ్చింది. దీంతో మిగతా సిబ్బంది లో భయం మొదలైంది. అయితే ఒక్క సారిగా ఒక హోటల్లో 85 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మున్సిపల్ అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఇక చెన్నై నగరంలో ఉన్న మిగతా లగ్జరీ హోటల్స్ లో కూడా ఇలాంటి తరహా కరోనా పరీక్షలు నిర్వహించాలని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు. హోటల్ యాజమాన్యం కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని లేనిపక్షంలో చర్యలు తప్పవంటూ మున్సిపల్ అధికారులు హెచ్చరించారు.