కొత్త ఏడాదిలో కొత్త వైరస్.. వణికి పోతున్న జనాలు..?
దేశ వ్యాప్తం గా పలు ప్రాంతా లలో బర్డ్ ఫ్లూ కేసులు భారీగా బయట పడుతూ ఉన్నాయి పెద్ద మొత్తంలో పక్షులు మృత్యువాత పడుతున్నాయి. నెమళ్లు కాకుల తో పాటు ఇతర పక్షులు కూడా వేల సంఖ్యలో మరణిస్తూ ఉండడం అందరిని ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే అప్రమత్తమైన అధికారులు మరణించిన పక్షులకు పరీక్షలు నిర్వహించగా హెచ్5ఎన్8 వైరస్ వచ్చినట్లు తేలింది. ఇక ఈ వైరస్ తో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఈ కొత్తరకం వైరస్ సోకి రాజస్థాన్లోని నాగపూర్ జిల్లాలో 50 కి పైగా నెమళ్లు మరణించాయి.
వీటితోపాటు కాకులు పావురాలు కూడా చనిపోయాయి. ఒక మరోవైపు ఝాల బాద్ ప్రాంతంలో వందకు పైగా కాకులు మరణించాయి. ఈ క్రమంలోనే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉన్నఫలంగా భారీ సంఖ్యలో కాకులు మరణించడంతో అధికారులు కూడా కంగారు పడిపోయారు పరీక్షలు నిర్వహించగా కొత్త వైరస్ బయటపడింది. ఈ క్రమంలోనే అప్రమత్తమైన అధికారులు ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల నమూనాలను సేకరిస్తున్నారు.