బాలికను కిడ్నాప్ చేసిన పక్కింటి వ్యక్తి.. కారణం తెలిసి పోలీసులే షాక్..?

praveen
ఈ మధ్యకాలం లో తెలుగు రాష్ట్రా లలో కిడ్నాప్లు కల కలం సృష్టిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. చిన్న పిల్లలను కిడ్నాప్ చేయడం ఆ తర్వాత వారి తల్లి దండ్రులను భారీగా డబ్బులు డిమాండ్ చేయడం లాంటి ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. ఈ క్రమం లోనే ఎప్పటి కప్పుడు ఎంతో అప్రమత్తం గా ఉంటున్నా పోలీస్ అధికారులు కిడ్నాప్ కేసుల ను కేవలం గంటల వ్యవధి లోనే చేధిస్తున్నారు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లా లో కిడ్నాప్ కేసు కలకలం సృష్టించింది.


 వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాప్ జరిగిన కేవలం మూడు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించడం తో ప్రస్తుతం ప్రశంసలు అందుకుంటున్నారు.  వివరాల్లోకి వెళితే..  తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి లోని ఇన్నిసుపేట  దుర్గమ్మ గుడి వీధికి చెందిన  రాము అనే వ్యక్తికి కూతురు రోహిణి ఉంది.  ఇటీవలే ఇంటివద్ద ఆడుకుంటున్న సమయంలో..  అదే ప్రాంతం లో ఉండే సత్య నారాయణ అనే వ్యక్తి సదరు బాలికకు మాయ మాటలు చెప్పి బైక్ ఎక్కించుకుని వెళ్ళాడు.


 అయితే కాసేపటికి కూతురు కన్పించక పోవడంతో తల్లి దండ్రులు కంగారు పడిపోయారు. స్థానికులను అడగగా సత్యనారాయణ బైక్ పై  ఎక్కించుకుని వెళ్ళాడు అన్న విషయాన్ని చెప్పారు. దీంతో అప్రమత్తమైన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో వెంటనే అప్రమత్తమైన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే బాలికను అపహరించిన సత్య నారాయణ దేవరపల్లి మండలం తిరుగుడు మెట్ట వద్ద ఉన్నట్లు గుర్తించి వెంటనే అక్కడికి చేరుకుని బాలికను రక్షించారు. అయితే ఏలూరుకు చెందిన సీతారత్నం జ్యోతి అనే మహిళలు బాలికను పెంచుకుంటామని చెప్పడంతోనే ఇలా అపహరించినట్లు పోలీసులు కారణం చెప్పాడు సత్యనారాయణ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: