బ్రేకింగ్: రామతీర్ధం ఘటనపై జగన్ సంచలన నిర్ణయం
రామతీర్థం ఆలయాన్ని ఆధునీకరణ చేయనున్నాం అని అన్నారు. ఆలయ నిర్మాణ పనులు, విగ్రహ ప్రతిష్ఠ పనులపై టీటీడీ తో సంప్రదింపులు జరిపి పనులు మొదలు పెడతాం అని ఆయన పేర్కొన్నారు. రామతీర్థం చాలా చిన్న ప్రాంతం, ఇరుకు ప్రాంతం కాబట్టి అక్కడ రేపు ర్యాలీలు చేయవద్దని బీజేపీ ని కోరుతున్నా అని, ప్రభుత్వం సలహాలు సూచనలు స్వీకరిస్తాం, రాజకీయ బురద, కుట్ర చేయటం సరికాదు అని ఆయన హితవు పలికారు. రాజమండ్రి ఆలయంలో సుబ్రమణ్య స్వామి ఆలయ దాడిపై కూడా సీఐడీ విచారణ కు ఆదేశం ఇచ్చినట్టు చెప్పారు.
దేవాదాయ శాఖ కు సంబంధించి 8 ఆలయాల్లో ఘటనలు జరిగాయి అని అన్నారు. చోరీలు, గుప్త నిధుల, ఇతర కారణాలపై 88 కేసులు అయ్యాయి అని ఆయన వెల్లడించారు. 159 మందిని అరెస్టులు జరిగాయి అని పేర్కొన్నారు. 57,584 దేవాలయాలు ఏపీలో ఉన్నట్టు మ్యాపింగ్ జరిగింది అని అన్నారు. 3618 ఆలయాల దగ్గర సీసీ టీవీలు ఉన్నాయి 13166 కెమెరాలు ఏర్పాటు అయ్యాయి అని అన్నారు. 39,076 కెమెరాలు ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసి పరివేక్షణ చేస్తున్నాం అని వెల్లడించారు. ప్రైవేట్, ప్రభుత్వ ఆలయాల దగ్గర కూడా పోలీస్ నిబంధనల అమలుకు చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేసారు. దేవాదాయ శాఖ నిధులు వేరే వాటికి వినియోగించటం లేదు అని అన్నారు. ఆలయాల కోసమే దేవాదాయ శాఖ నిధులు వినియోగిస్తున్నాం అని పేర్కొన్నారు.