ఈ బ్యాంకులో ఖాతా ఉందా.. అయితే మీకే గుడ్ న్యూస్.. ఇక అంతా వాట్సాప్ నుండే..?
ఇటీవలి కాలంలో తమ కస్టమర్లకు పర్సనల్ లోన్స్ అందించడంలో కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా కీలక నిర్ణయాలు తీసుకుంటూ కష్టమర్ లందరికీ ప్రయోజనాలు చేకూరే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా తమ బ్యాంకు కస్టమర్లకు అన్ని రకాల కార్యకలాపాలు ఎంతో సులభంగా అర్థం అయ్యే విధంగా కీలక నిర్ణయం తీసుకుని ఇటీవలే తమ కస్టమర్లకు శుభ వార్త చెప్పింది బ్యాంక్ ఆఫ్ బరోడా. సాధారణంగా ఇప్పటివరకు చెక్ బుక్ అప్లై చేసుకోవాలి అన్న బాలన్స్ ఎంక్వైరీ చేయాలి అన్న అటు బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు కాస్త ఇబ్బంది పడుతూ ఉండేవాడు.
కానీ ఇక నుంచి ఆ ఇబ్బందులు మొత్తం తీరిపోనున్నాయి ఎందుకంటే బ్యాంక్ ఆఫ్ బరోడా తమ ఖాతాదారులకు కోసం వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. బాలన్స్ ఎంక్వయిరీ, మినీ స్టేట్మెంట్, చెక్ స్టేట్మెంట్ ఎంక్వయిరీ, చెక్ బుక్ కోసం అభ్యర్థనలు సహా డెబిట్ కార్డు బ్లాక్ చేయడం సహా మరికొన్ని రకాల సేవలు కూడా ప్రస్తుతం వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉంచింది బ్యాంక్ ఆఫ్ బరోడా. 8433888777 నెంబర్కు వాట్సాప్ నుంచి హాయ్ అని పంపిస్తే మిగతా వివరాలు పొందేందుకు అవకాశం ఉంటుంది.. ఈ సర్వీస్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది.