ప్రభుత్వ స్కీమ్ తో.. నెలకు నాలుగు లక్షలు సంపాదిస్తున్నాడు.. మీరు ట్రై చేయొచ్చు..?
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ప్రజలందరికీ మేలు జరిగే విధంగా అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంచింది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రజలందరికీ ప్రయోజనం చేకూరే విధంగా ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న యోగి ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించే విధంగా సరికొత్త స్కిమ్ తీసుకొచ్చింది. ప్రస్తుతం యోగి ప్రభుత్వం రోజ్గార్ యోజన స్కీమ్ అందిస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ స్కీమ్ లో లక్నోకు చెందిన అశ్వనీ ద్వివేది అనే వ్యక్తి భారీ ఆదాయాన్ని పొందుతున్నాడు.
2018 సంవత్సరం నుంచి పుట్టగొడుగుల సాగు చేస్తున్నాడు అశ్విని ద్వివేది అనే వ్యక్తి. రెండేళ్ల నుంచి ఎనిమిది రకాల పుట్టగొడుగులు వెరైటీలను పెంచుతూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే నెలకు 7 క్వింటాళ్ల వరకు పుట్టగొడుగుల సాగు దిగుబడి గా పొందుతున్నాడు. ప్రస్తుతం మార్కెట్లో పుట్టగొడుగుల కు భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో నెలకు నాలుగు లక్షల వరకు సంపాదిస్తున్నాడు అశ్విని ద్వివేది. 2017 లో పుట్టగొడుగుల పెంపకం పై తీసుకున్న అశ్వినీ త్రివేది ప్రస్తుతం లక్షలు ఆర్జిస్తున్నారు.