శవమై ఇంటికి వచ్చిన తల్లి.. అయినా కొడుకుకు భారమైంది.. చివరికి..?

praveen
నా కొడుకు నాకెందుకు భారం  అవుతాడులే..  అని అనుకొని ఎన్ని కష్టాలు వచ్చినా నవమాసాలు మోసి... పేగు తెంచుకొని పుడుతున్నప్పటికీ ఎంతో సంతోషంగా ఆ నొప్పిని భరించి.. ఇక ఆలనా పాలనా చూసి పెద్ద చేసిన ఆ తల్లి చివరికి పెద్దయ్యాక కొడుకుకి భారం గా మారిపోయింది.  తల్లి విషయంలో కాస్తయినా కనికరం చూపించలేదు ఆ కొడుకు.  బ్రతికుండగానే కాదు.. చనిపోయి శవంగా తల్లి ఇంటికి తిరిగి వచ్చినప్పటికీ ఆ కొడుకు మనసు కరగలేదు. కన్నతల్లి శవమై ఇంటికి వస్తే కనీస కనికరం లేకుండా కసాయి గా వ్యవహరించాడు కొడుకు. అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సి ఉంది పోయి.. తల కొరివి పెట్టను అంటూ ఇంటికి తాళం వేసుకొని వెళ్లి పోయాడు.



 అంతే కాదు తల్లి శవాన్ని ఇంటికి తీసుకువచ్చిన అక్క బావ పైన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేందుకు ప్రయత్నించాడు.  ఇంతకీ అతడు ఒక సాదాసీదా మనిషి కాదు సభ్య సమాజంలో ఎంతో బాధ్యతగా వ్యవహరించి ప్రజలకు రక్షణ కల్పిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ఒక కానిస్టేబుల్. ఎస్పీ జోక్యం చేసుకోవడంతో వెనక్కి తగ్గాడు కానిస్టేబుల్. ఈ ఘటన కృష్ణాజిల్లాలో వెలుగులోకి వచ్చింది.  ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నాగప్రసాద్ మచిలీపట్నంలో సమీపంలో నివాసం ఉంటున్నాడు.


 ఇక నాగ ప్రసాద్ తల్లి కూతురు ఇంట్లో ఉండగా.. అక్కడ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. ఇక మృతదేహాన్ని కొడుకు నాగప్రసాద్ ఇంటికి తీసుకొచ్చారు కూతురు అల్లుడు. ఇక తల్లి శవమై ఇంటికి వచ్చినప్పటికీ కొడుకు మనసు కదిలించలేకపోయింది.  ఇంతకు ముందు వీరి మధ్య ఏ గొడవలు ఉన్నయో తెలియదు కానీ కన్నతల్లి శవాన్ని ఇంట్లోకి రాకుండా ఇంటికి తాళం వేసుకొని వెళ్లి పోయాడు.  మృతదేహాన్ని తీసుకొచ్చిన అక్క బావ పై కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. ఇక తీర జిల్లా ఎస్పీ వరకు ఈ విషయం వెళ్లడంతో ఇక ఎస్పి జోక్యంతో వెనక్కి తగ్గి తల్లి అంత్యక్రియలకు అంగీకరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: