అపర కుబేరుడు కనిపించకుండా పోవడం వెనుక..!
ప్రముఖ టాలెంట్ షో ఆఫ్రికా బిజినెస్ హీరోస్ ఫైనల్లో జాక్ మా జడ్జిగా పాల్గొనాల్సి ఉంది. అయితే ఆ షో నిర్వాహకులు తయ వెబ్ సైట్ నుంచి జాక్ మా ఫొటోలను తొలగించారు. దీంతో జాక్ మా ఏ మయ్యారనేది మిస్టరీగా మారింది. ఏ విషయమైనా చాలా రహస్యంగా జరిగే చైనాలో... ప్రస్తుతం నడుతున్న అంతుచిక్కని పరిణామాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చైనా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తే వాళ్లలో జాక్ మా కూడా ఒకరు. ఈ క్రమంలోనే చైనా తీసుకొచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్కరణలపై జాక్ మా విమర్శలు చేశారు. ఆ సంస్కరణలు అవి వృద్ధ విధానాలని, వాటి వల్ల వివిధ వ్యాపార నష్టపోతాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు జాక్ మా. జాక్ మా విమర్శలపై చైనా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అక్టోబర్ తర్వాత ఆయన వ్యాపారాలు భారీగా నష్టాలను చవిచూస్తున్నాయి.
యాంట్, అలీబాబా సంస్థల అధిపతిగా జాక్ మా... చైనాలో అత్యధిక సంపద గల వాళ్లలో రెండో స్థానంలో ఉన్నారు. చైనా ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేసిన జాక్ మా... అక్కడి బ్యాంకింగ్ విధానాలపై మండిపడ్డారు. బ్యాంకుల్లో సంస్కరణలు తేవడం లేదని, బ్యాంకులను తాకట్టు దుకాణాల్లా నడుపుతున్నారని ఆరోపించారు. తర్వాత సీన్ మారిపోయింది. భారత కరెన్సీ ప్రకారం ఆయన సంస్థలు ఈ మధ్య కాలంలో 83వేల కోట్ల రూపాయలు నష్టపోయాయి. అలాగే జాక్ మా సంస్థ యాంట్ గ్రూప్ కు దక్కాల్సిన ఓ పబ్లిక్ ప్రాజెక్టును చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆదేశాలతో నిలిపివేశారు బీజింగ్ అధికారులు.
జాక్ మా దాదాపు రెండు నెలలుగా కనిపించకుండా పోవడం కార్పొరేట్ ప్రపంచంలో సంచలనంగా మారింది. ముందే షెడ్యూలైన కార్యక్రమాల్లో ఆయన పాల్గొనకపోవటంపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దీని వెనుక చైనా ప్రభుత్వ హస్తం ఉందేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.