ఎస్బిఐ అదిరిపోయే ఆఫర్.. 5లక్షల లోన్.. 10వేల ఈఎంఐ..?
ఇప్పటికే తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు మెరుగైన సర్వీసులు అందించడమే కాదు వివిధ రకాల ఆఫర్ ల ద్వారా ఆర్థిక భద్రత కల్పిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చూస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం తమ కస్టమర్లందరికీ అదిరిపోయే పర్సనల్ లోన్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అయితే 9.6 శాతం వడ్డీ రేటు తో ప్రస్తుతం పర్సనల్ లోన్ తమ కస్టమర్లకు అందించేందుకు సిద్ధమైంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఒకవేళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 5 లక్షల వరకు పర్సనల్ లోన్ తీసుకుంటే నెలకు ఈఎంఐ కేవలంపది వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలతో ప్రారంభమవుతుంది.
ఇక ఈ పర్సనల్ లోన్ టెన్యూర్ ఐదేళ్ల వరకు కొనసాగుతుంది. అంతేకాకుండా మీరు బ్యాంకుకు వెళ్లకుండానే ఇంట్లో నుండి పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఒకవేళ మీరు బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లకుండానే పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోవాలి అని భావిస్తే.. https://onlineapply.sbi.co.in/personal-banking/personal-loan ఈ లింక్ ఓపెన్ చేసి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి ఈ పర్సనల్ లోన్ ఆప్షన్ ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పాలి. ఒకవేళ మీకు పర్సనల్ లోన్ కావాలంటే వెంటనే అప్లై చేసుకోండి.