తెగించిన చైనా.. అన్ని దొంగచాటు యవ్వరాలే..?
కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి కూడా చైనా సరికొత్త వాదనను వినిపిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. చైనా కరోనా ఊహన్ నగరంలోని ల్యాబ్ లో పుట్టలేదని అది గబ్బిలాలు జంతువుల నుంచి పుట్టింది అంటూ చైనా వాదన వినిపించిన విషయం తెలిసిందే. ఇటీవల చైనా అందరిని ఆశ్చర్య పరిచే విధంగా వ్యవహరించింది. కరోనా వైరస్ కు చైనా కు అసలు సంబంధమే లేదు అంటూ వ్యాఖ్యానించింది. భారత్ బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో కరోనా వైరస్ మొదటి కేసు నమోదయింది అంటూ సంచలన ఆరోపణలు చేసింది.
అయితే ఇలా ఎన్ని వాదనలు చేసినప్పటికీ ప్రపంచ దేశాలు మాత్రం చైనా చెప్పిన విషయాన్ని నమ్మే పరిస్థితిలో లేవు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం చైనా ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలను పరీక్షలు జరిపేందుకు అనుమతిచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు బయలుదేరుతున్న సమయంలో వారికి ఇబ్బందులు కలిగించడం మొదలుపెట్టింది. అంతే కాదు ఊహన్ నగరం లోకి సరైన పరిశోధనలు జరిపేందుకు చైనా అంగీకరించలేదు. ఇలా ప్రతి విషయంలో కూడా చైనా డబుల్ గేమ్ ఆడుతూ ఉండటం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం మారిపోయింది.