ఈ బ్యాంకులో మీకు అకౌంట్ ఉందా.. అయితే మీకే ఈ న్యూ ఇయర్ గిఫ్ట్..?

praveen
ప్రస్తుతం  ప్రైవేటు రంగ బ్యాంకులు ఎప్పటి కప్పుడు తమ కస్టమర్లకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి  అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ప్రైవేటు రంగానికి చెందిన ఐ డి ఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుని కస్టమర్లకు శుభ వార్త చెప్పింది. కొత్త సంవత్సరం గిఫ్ట్ అందించింది. ఇటీవలే తమ బ్యాంక్ సేవింగ్ అకౌంట్ లపై వడ్డీ రేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది బ్యాంకు.


 దీంతో సేవింగ్స్ అకౌంట్ కలిగిన కష్టమర్లందరికీ కూడా ఎక్కువ వడ్డీ లభించనునట్లు తెలుస్తోంది.  వడ్డీరేట్ల పెంపు నిర్ణయం జనవరి 1 నుంచి అమలులోకి వస్తుందని బ్యాంకు తెలిపింది. ప్రస్తుతం ఈ సేవింగ్స్ అకౌంట్ లో  లక్షరూపాయల వరకు బాలన్స్ ఉంటే  ఇకపై వారికి 7 శాతం వరకు వడ్డీ రేట్  లభిస్తుందని  బ్యాంకు శుభ వార్త చెప్పింది. అయితే ఇప్పటి వరకు ఈ బ్యాలెన్స్ కలిగిన అకౌంట్ పై  కేవలం ఆరు శాతం మాత్రమే వడ్డీ రేటు అందించేది ఐ డి ఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్.  అయితే ఇతర బ్యాంకులు అందించే వడ్డీ రేట్లతో పోలిస్తే ప్రస్తుతం ఈ బ్యాంకు అందిస్తున్న వడ్డీ రేటు రెట్టింపు అని చెప్పాలి.


 ఇటీవల సేవింగ్ అకౌంట్ లో వడ్డీ రేట్లను పెంచుతూ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకోవడంతో కస్టమర్ల పై ఎంతగానో సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అటు బ్యాంకు తీసుకున్న నిర్ణయంతో కస్టమర్లకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.  ఒకవేళ మీరు కూడా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలని భావిస్తే ఆన్లైన్లోనే అకౌంట్ తెరిచేందుకు అవకాశం ఉంటుంది..  దీనికోసం మీరు https://www.idfcfirstbank.com ఈ లింక్ ఓపెన్ చేసి అకౌంట్ తెరిచేందుకు అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: