అదిరిపోయే ఆఫర్.. రూ. 20 వేలకే మీకు నచ్చిన బైక్ కొనెయ్యండి..?

praveen
అదేంటిమార్కెట్లో బైక్ ధరలు ఆకాశాన్ని అంటుతుంటె   20 వేల రూపాయలు చెల్లించి బైక్ కొనుగోలు చేయడం ఎలా అని అని ఆశ్చర్య పోతున్నారు కదా..  ప్రస్తుతం సంక్రాంతి పండక్కి బైక్ కొనుగోలు చేయాలనుకుని  ఇక అటు షో రూమ్ కి వెళ్లి బైక్ రేట్లు కనుక్కొని ఇక ఆకాశాన్నంటిన బైక్ రేట్లతో షాక్ అయి ఇక తక్కువ బడ్జెట్తో సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకోవాలని నిర్ణయించుకున్న వారికి ఇదే మంచి సమయం అని చెప్పాలి.  అతి తక్కువ ధరలోనే మీకు నచ్చిన బైక్ కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.  దీనికోసం మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం కూడా లేదు.


 ఆన్లైన్ లోనే సెకండ్ హ్యాండ్ టు వీలర్ బైక్ కొనేందుకు ప్రస్తుతం అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. దీనికోసం పలు రకాల ఆప్షన్లు కూడా ఉన్నాయి.  ఇప్పటికే ఎన్నో రకాల వెబ్ సైట్లు సెకండ్ హ్యాండ్ బైక్ లను అమ్మేందుకు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తున్నాయి  అన్న విషయం తెలిసిందే. సెకండ్ హ్యాండ్ బైక్స్ అమ్ముతున్న వాటిలో డ్రుమ్  అనే వెబ్సైట్ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఈ వెబ్ సైట్ కి వెళ్లి మీరు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది.  15 వేల నుంచి 40 వేల మధ్యలో డబ్బులు పెట్టారంటే మీకు మంచి బైక్ వస్తుంది.



 ఇక ప్రస్తుతం ఎంతోమంది సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకునేవారు ఇలా డ్రుమ్ వెబ్సైట్ ద్వారా తమకు నచ్చిన బైక్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే రూమ్ వెబ్సైట్ లో పలు రకాల బైకుల ధరలు ఇలా ఉన్నాయి... హీరో స్ల్పెండర్ ప్లస్ 100 సీసీ బైక్ 2001 బైక్ రూ.23 వేలకు అందుబాటులో ఉంది. బజాజ్ పల్సన్ 150 బైక్ 2011 మోడల్ రూ.30 వేలకు అందుబాటులో ఉంది. టీవీఎస్ స్టార్ సిటీ 110 సీసీ 2007 మోడల్ రూ.18 వేలకు కొనొచ్చు. ఇంకా బజాజ్ పల్సర్ 180 సీసీ 2009 బైక్ రూ.35 వేలకు లభ్యమౌతోంది. హోండా సీబీ ట్విస్టర్ 110 సీసీ 2012 మోడల్ రూ.33,333కు లభిస్తోంది. యమహా ఎఫ్‌జెడ్ 150 సీసీ 2014 మోడల్ రూ.50 వేలకు కొనుగోలు చేయొచ్చు. ఇలా మీకు నచ్చిన బైక్ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: