పట్టా పాస్ బుక్ రాలేదా.. అయితే ఇలా చేయండి..?

praveen
ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వో వ్యవస్థను రద్దుచేసి కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.  అప్పటి వరకు ఎంతో కష్టంగా ఉన్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఎంతో సరళంగా మారుస్తూ ప్రజలందరికీ ప్రయోజనం చేకూరే విధంగా ధరణి పోర్టల్ ను  అందుబాటులోకి తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎంతోమంది ధరణి పోర్టల్ ద్వారా సేవలు పొందుతూ శరవేగంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేసుకుంటున్నారు. ఒకప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంటే నెలలతరబడి జరిగేది రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కూడా పట్టా పాస్ పుస్తకం చేతికి వచ్చేందుకు ఎన్నో రోజుల సమయం పట్టేది. కానీ ప్రస్తుతం ధరణి పోర్టల్ ద్వారా ఎంతో సులభంగా నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవడం తో పాటు పట్టా పాస్ బుక్ చేతికి వస్తుంది.



 ఈ క్రమంలోనే ధరణి పోర్టల్ ద్వారా ఎంతోమంది ఎంతో సులభంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఒకప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఎన్నో వ్యవసాయ భూములకు సంబంధించిన పట్టా పాస్ పుస్తకాలు ఇప్పటికీ రాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ధరణి పోర్టల్ ప్రారంభం కావడంతో అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములు రిజిస్ట్రేషన్ అయ్యాయా..  అయితే ఇంకా ఎందుకు పట్టా పాస్ పుస్తకాలు రాలేదు అని ప్రస్తుతం ఎంతో మంది రైతులు ఆందోళన చెందుతున్నారు అన్న విషయం తెలిసిందే.  గతంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయి నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ పట్టా పాస్ పుస్తకాలు పొందని వారు ఉన్నారు.


 ఇలాంటి వారికి ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పట్టా పాస్ పుస్తకాలు పొందని ఖాతాలకు ఆధార్ కార్డు అనుసంధానించడానికి ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఆధార్ కార్డు అనుసంధానం సమస్యల కారణంగానే ఆరు లక్షలకు పైగా ఖాతాలకు పట్టా పాసు పుస్తకాలను నిలిపి వేసినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే ఆయా బాధితులు  అందరూ కూడా మీ సేవా కేంద్రాల్లో 35 రూపాయలు చార్జి చెల్లించి ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోవాలని సూచించింది ప్రభుత్వం. ఇక ఆధార్ కార్డు అనుసంధానం ప్రక్రియ పూర్తయిన వెంటనే డిజిటల్ సంతకాలు ప్రక్రియ పూర్తవుతుందని ఇక ఆ తర్వాత వెంటనే ఇంటికి పట్టాదారు పాసుపుస్తకం వస్తుంది అంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: