సూట్ కేసు లో మృతదేహం.. చంపింది ఎవరో కాదు.. విచారణలో షాకింగ్ నిజం..?
అంతేకాదు ప్రాణాలకు అసలే విలువ ఇవ్వడం లేదు. చిన్న చిన్న కారణాలకే దారుణంగా ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి అనే విషయం తెలిసిందే. అప్పటివరకు స్నేహితులుగా ఉన్న వారే చిన్న చిన్న కారణాలతో బద్ద శత్రువులు గా మారిపోయి ఏకంగా దారుణంగా హత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెర మీదికి వచ్చి సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. రోజురోజుకు ఇలా దారుణ ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది ఇక్కడ. తరచూ దొంగతనాలకు పాల్పడుతూ పోలీసుల నుంచి తప్పించుకుని తిరిగే ఓ ముఠా సభ్యులు . తమ గ్రూపులోని ఒక దొంగని దారుణంగా హతమార్చారు.
ఇక ఎవరికీ తెలియకుండా దొంగ మృతదేహాన్ని ఒక సూట్ కేసులో పెట్టి నిర్మానుష్య ప్రదేశంలో వదిలేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్లో వెలుగులోకి వచ్చింది. రాజేంద్ర నగర్ లో సూట్ కేసులో మృతదేహం లభ్యం కావడం కలకలం సృష్టించింది. అయితే ఇద్దరు దొంగలను పోలీసులు విచారిస్తున్నారు. వారిద్దరూ మరో దొంగ రషీద్ని హత్యచేసి సూట్ కేస్ లో మృతదేహాన్ని పడేసినట్లు పోలీసుల విచారణలో నేరం అంగీకరించారు. ఈ మేరకు సూట్కేస్ ఉన్న ప్రాంతానికి వెళ్ళి పరిశీలించగా మృతదేహం లభ్యమైంది. అయితే ఈ హత్య జరగడానికి పాత కక్షలే కారణమా లేదా ఇంకేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు.