బట్టలు ఆరేస్తూ చనిపోయిన భార్య భర్తలు.. ఏం జరిగిందంటే..?

praveen
మృత్యువు ఎప్పుడు ఎటు  నుంచి వచ్చి ప్రాణాలను హరించుకు  పోతుందా అన్నది ఊహకందని విధంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో అనుకోని విధంగా మృత్యువు కబలిస్తుంది. ఇక్కడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ బట్టలు ఉతికి ఆరేస్తుంది. కానీ ఊహించని రీతిలో ఆమెకు కరెంట్ షాక్ కొట్టింది. అయితే భార్యకు కరెంట్ షాక్ కొట్టింది అని గమనించిన భర్త ఉరుకుల పరుగుల మీద అక్కడికి వచ్చాడు.. అయితే భార్యను ముట్టుకుంటే ఆ తనకు కూడా కరెంట్ షాక్ కొడుతుంది అన్న విషయాన్ని మరిచి పోయి పొరపాటున భార్యను ముట్టుకున్నాడు.  ఇక చివరికి భర్తకు కూడా కరెంట్ షాక్ కొట్టింది దీంతో వారిద్దరూ కరెంట్ షాక్ తో విలవిలలాడిపోతూ ఉంటే.. ఇంటి ఎదురుగా ఉన్న దంపతులు వచ్చి.. కంగారులో వాళ్లు కూడా వాళ్లను పట్టుకున్నారు.. దీంతో రెండు జంటలూ చూస్తుండగానే కరెంట్ షాక్ తో బలయ్యాయి.



 ఈ విషాదకర ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఆమనగల్లు లో సత్తయ్య రాధమ్మ దంపతులు ఉంటున్నారు. అయితే రాధమ్మ ఇటీవలే బట్టలు ఉతికి ఇంటి ఎదురుగా ఉన్న వైరు పై ఉతికిన బట్టలను ఆరేసెందుకు ప్రయత్నించింది. అయితే ఆ వైరు కు విద్యుత్ వైరు తగిలి ఉండడంతో విద్యుత్ ప్రవాహం జరుగుతుంది ఇది గమనించని రాధమ్మ అలాగే బట్టలు ఆరేసింది. దీంతో  ఆమెకు షాక్ కొట్టింది. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న భర్త సత్తయ్య ఆమెను గమనించి కాపాడేందుకు ప్రయత్నించాడు ఇక వీరిద్దరికి షాక్  కొట్టింది.


 వెంటనే కరెంట్ షాక్ కొట్టి విల విల లాడి పోతున్న ఇద్దరిని గమనించిన ఎదురింట్లో ఉన్న దంపతులు లింగయ్య లచ్చమ్మ పరుగున వచ్చి వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే కర్రతో వారిని కాపాడటం మానేసి వారు కూడా వచ్చి ఇద్దరు దంపతులు ముట్టుకోవడంతో అందరికీ కరెంట్ షాక్ కొట్టింది. దీంతో నలుగురు కరెంట్ షాక్ తో విలవిలలాడుతూ అక్కడే ప్రాణాలు వదిలారు. అయితే ఒకే సారి కరెంట్ షాక్ కారణంగా  నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక ఎంతో మంది బంధువులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: