హైదరాబాదులో ఫ్రీ వాటర్.. ప్రభుత్వం మార్గదర్శకాలు ఇవే..?
గ్రేటర్ పరిధిలో ఈ ఉచిత నీటి అమలులో భాగంగా ఆధార్ కార్డులు ప్రామాణికంగా తీసుకునేందుకు అటు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బస్తీలలో మాత్రం నల్లాకు మీటర్లు లేకపోయినప్పటికీ డాకెట్ ఆధారంగా బిల్లుల వసూలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కానీ అటు అపార్ట్మెంట్లలో మాత్రం తప్పనిసరిగా మీటర్లు ఉండాలి అనే నిబంధన పెట్టింది ప్రభుత్వం. అయితే ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా 20 వేల లీటర్ల వరకు ఉచితంగా నీరు ఉపయోగించుకునేందుకు అవకాశం ఉండగా.. ఒక వేల 20 వేల లీటర్ల కంటే ఎక్కువ లీటర్లునీటిని వినియోగిస్తే ఇక చార్జీలు చెల్లించక తప్పదు.
అదే సమయంలో ప్రస్తుతం సిటీలో ఉన్న స్లమ్ ఏరియాలో ఉన్న పలురకాల నల్ల కనెక్షన్లకు ఎలాంటి బిల్లు ఉండబోదు అని స్పష్టం చేస్తూ అందరికీ శుభ వార్త చెప్పింది ప్రభుత్వం. దీని కోసం స్లమ్ లలో ఉండే ప్రజలు నల్లా కు ప్రత్యేకంగా మీటర్ బిగించుకోవాల్సిన అవసరం లేదు అంటూ తెలిపింది. కేవలం డొమెస్టిక్ యూజర్లు మాత్రమే 20 వేల లీటర్ల ఉచితంగాదెంగించుకునేందుకు అవకాశం ఉందని వారు తప్పనిసరిగా మీటర్ బిగించుకోవాలి అంటూ మార్గదర్శకాలు జారీ చేసింది.