హై టెన్షన్ వైర్లను పట్టుకున్నాడు.. చివరికి మొత్తం బూడిదే..?
ఈ విషాదకరమైన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఏకంగా హైటెన్షన్ వైర్లకు ఒక వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం గా మారి పోయింది. వివరాల్లోకి వెళితే.. మల్యాల మండలం లో జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారి పై 130కేవి కరెంట్ టవర్ వుంది. ఇక ఇటీవలే ఈ హైటెన్షన్ వైర్లు ఉన్న టవర్ ఎక్కిన ఒక గుర్తు తెలియని వ్యక్తి హైటెన్షన్ వైర్లకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో స్థానికులు అందరూ ఒక్క సారిగా షాకయ్యారు.
సాధారణ విద్యుత్ తీగలు పట్టుకుంటేనే మనిషి మృతదేహం మొత్తం కాలి పోతుంది. ఇక హై టెన్షన్ వైర్లను పట్టుకోవడంతో మృతదేహం మొత్తం ఎక్కడికక్కడ పూర్తిగా బూడిద గా మారి పోయింది. దీంతో షాక్ అయిన స్థానికులు వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం అందించడంతో విద్యుత్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమం లోనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.