కనికరం లేని కరోనా రక్కసి.. జాబ్ తీసి.. ప్రాణం పోయేలా చేసింది..?
ఇక కరోనా పరిస్థితులు సద్దుమణిగాక మళ్లీ తమ ఉద్యోగాలు తమకు వస్తాయని ఎంతోమంది ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. కానీ అలా ఎదురు చూస్తున్న వారికి ఇప్పటికీ నిరాశే ఎదురవుతుంది. ఇక కరోనా వైరస్ రాకముందు ఉన్నత ఉద్యోగంలో కొనసాగిన వారు సైతం ప్రస్తుతం దినసరి కూలీలుగా మారిన ఎన్నో హృదయవిదారక ఘటనలు తెరమీదకు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. కొంతమంది ఆర్థిక ఇబ్బందులు తాళలేక మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన లకు కూడా కరోనా వైరస్ కారణం అయ్యింది.
ఇక ఇప్పుడు కరోనా వైరస్ సోక కుండానే మరో ప్రాణాన్ని బలితీసుకుంది. కరోనా కష్టకాలంలో జాబ్ నుంచి తీసేసారు అన్న ఆవేదనతో ఓ పాఠశాల బస్సు డ్రైవర్ అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేరళలోని తిరువనంతపురంలో ఈ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీ కుమార్ అనే వ్యక్తి ఓ స్కూల్లో బస్సు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. కరోనా సమయంలో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించగా ఇటీవలే పాఠశాలలో తెరుచుకోవడం తో మళ్ళి జాబ్ లో జాయిన్ కావడానికి వెళ్ళాడు. కానీ పాఠశాల సిబ్బంది జాబ్ లేదు అని చెప్పడంతో మనస్థాపానికి గురయ్యాడు. దీంతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకొని అందరూ చూస్తుండగానే సజీవదహనం అయ్యాడు.