ప్రేమించాడు.. కానీ పెళ్లి వద్దన్నాడు.. యువతి ఏం చేసిందో తెలుసా..?

praveen
ప్రేమ అనేది ఒక మధురానుభూతి అని చెబుతూ ఉంటారు. కానీ నేటి రోజుల్లో  ప్రేమ అనేది ప్రాణాలు పోవడానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అన్న విధంగానే ఉంది పరిస్థితి. ప్రేమించిన పాపానికి కొంతమంది పెద్దలు పరువు పోతుంది అని భావించి ఏకంగా కన్న బిడ్డలు అనే తేడా లేకుండా దారుణంగా హత మారుస్తూన్న ఘటన లు  కొన్ని అయితే..
 ప్రేమించిన వాడు దక్కలేదు అనే మనస్థాపంతో ఎంతోమంది ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటనలు మరికొన్ని. ఇలా ప్రేమిస్తే ప్రాణాలు పోతున్నాయి.  ఇక్కడ ఇలాంటి తరహా విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది.



 ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించాడు అన్న కారణంతో యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు లో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..  పటాన్ చెరు  మండలం లక్దారం  చెందిన విజయలక్ష్మి భర్తతో వేరు గా ఉంటూ చిన్న కుమార్తె శ్రావని తో కలసి నివసిస్తుంది. అయితే ఇటీవలే బీకాం పూర్తి చేసిన శ్రావని పక్కింట్లో వున్న వెంకటరమణ అనే యువకుడిని ప్రేమిస్తోంది.  ఎన్నో రోజుల పాటు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇద్దరుసినిమాలు షికార్లు అంటూ బాగానే ప్రేమలో మునిగితేలారు.


 ఇక వీరి ప్రేమ  విషయం ఇటీవల ఇంట్లో తెలియడంతో శ్రావణి  మేనమామ పెళ్లి ప్రస్తావన తీసుకు వచ్చాడు. అయితే శ్రావణి ని  పెళ్లి చేసుకోవడానికి తన తల్లిదండ్రులు ఒప్పుకోరు అని ప్రియుడు వెంకటరమణ చెప్పడంతో శ్రావణి  ఒక్కసారిగా షాక్ అయింది. ఇక అప్పటి నుంచి వెంకటరమణ శ్రావణి ని  దూరం పెడుతూ వచ్చాడు.  అయితే తాను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన వ్యక్తి.. ఇక ఇప్పుడు పెళ్లికి నిరాకరించడంతో జీర్ణించుకోలేక పోయింది శ్రావణి.  ప్రియుడు లేని జీవితం  వద్దు అని భావించి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: