ఫుట్ బోర్డు ప్రయాణం.. కరెంట్ షాక్ తో నలుగురు మృతి..?

praveen
ఈ మధ్యకాలంలో ఫుట్ బోర్డ్ ప్రయాణం అనేది అందరికీ ఒక స్టైల్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. బస్సు మొత్తం కాళీ గా ఉన్నప్పటికీ ఫుట్ బోర్డ్ ప్రయాణం చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు యువత. అయితే ఫుట్ బోర్డు ప్రయాణం చేయడం కారణంగా ఎన్నో ప్రమాదాలు జరిగి ప్రాణాల మీదికి వచ్చే అవకాశం ఉందని అటు  అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తునప్పటికీ యువత తీరులో  మాత్రం మార్పు రాదు. ఎప్పుడు నిర్లక్ష్యంగా ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇలా కొన్ని కొన్ని సార్లు ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తూ ఉండటం కారణంగా ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగి చివరికి ప్రాణాలు పోవడం లాంటి ఘటనలు కూడా తెరమీదికి వస్తూ ఉంటాయి.



 ఇక ఇటీవల తమిళనాడులో ఇలాంటి ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఫుట్ బోర్డు ప్రయాణం నలుగురు ప్రయాణికులను బలితీసుకుంది. ఎంతోమంది ప్రయాణికులు ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు బస్సుపై కరెంట్ తీగలు తగలడంతో అందరికీ కరెంట్ షాక్ కొట్టి నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు వివరాల్లోకి వెళితే.. తంజావూర్ సమీపంలోని తిరువయ్యూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రైవేటు బస్సు డ్రైవర్ ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారు అని కూడా చూడకుండా ఓ ట్రక్కును ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించాడు.



 ఈ క్రమంలోనే అతి వేగం కారణంగా వాహనం పై నియంత్రణ కోల్పోయాడు బస్సు డ్రైవర్. ఈ క్రమంలోనే రోడ్డు పక్కకు దూసుకెళ్లిన బస్సు పక్కనే ఉన్న కరెంటు తీగలకు తగిలింది. ఇక బస్సుకు కరెంటు ప్రసారం కావడంతో ప్రయాణికులు అందరూ కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. కాగా  ఫుట్ బోర్డు చేస్తున్న నలుగురు ప్రయాణికులు బస్  నుంచి కిందపడిపోయారు.  కరెంటు వైర్లు తగిలిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి దీంతో పది మంది వరకు గాయపడ్డారు. ఇక ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్ స్పందించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: