భారత సైనికులకు కొత్త బట్టలు.. ఆ దేశపు సాయం మరువలేము..?

praveen
భారత చైనా సరిహద్దుల్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు ఇప్పట్లో సద్దుమణిగేలా మాత్రం కనిపించడం లేదు. అదే సమయంలో అటు చైనా ఎక్కడా  సరిహద్దులో తలెత్తిన వివాదాన్ని సద్దుమణిగేలా చేయడానికి ప్రయత్నించకుండా ఎప్పుడు డబుల్ గేమ్ ఆడుతున్న తరుణంలో అటు సరిహద్దుల్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిపోతుంది.  భారత్ చైనా సరిహద్దుల్లో తలెత్తిన వివాదం యుద్ధం వరకూ దారితీసే ప్రమాదం ఉంది అనే విధంగా మారిపోయింది సరిహద్దుల్లో పరిస్థితి. ఇక చైనాకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా భారత సైనికులు లడక్  ప్రాంతంలో పర్వతాలపై గడ్డకట్టుకుపోయే చలిలో కూడా ప్రాణాలను పణంగా పెట్టి పహారా కాస్తున్నారు.




 దాదాపు 50 వేల మంది సైనికులు ప్రస్తుతం లడక్ ప్రాంతంలో ఇలా మైనస్ డిగ్రీల చలిలో దేశం కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం లడక్ ప్రాంతంలో పహారా కాస్తున్న సైనికులు అందరికీ అన్ని ఏర్పాట్లు చేసేందుకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతుంది. భారీగా నిధులు వెచ్చించి సైనికులు అందరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే అటు భారత్ మిత్ర దేశాలు కూడా క్లిష్ట సమయంలో ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ భారత్కు అండగా నిలుస్తున్నాయి అనే విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే ఇటీవలే భారత మిత్ర దేశమైన అమెరికా కూడా భారత్ కు అండగా నిలిచింది. ఇటీవల లడక్ ప్రాంతంలో గడ్డకట్టుకు పోయే చలిలో కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధమయ్యి  పహారా కాస్తున్న సైనికుల కోసం ఎక్స్ టెండెడ్ కోల్డ్ వెదర్ క్లాతింగ్ కిట్స్ ను  అందించింది  అమెరికా. ఇటీవలే భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ వీటిని పరిశీలించేందుకు వెళ్ళారు. విపరీతమైన అటువంటి మంచులో  మనిషి బిగుసుకు పోయేది చలిలో.. లోపల సైనికులకు వేడిగా ఉండే విధంగా దుస్తులను అందించింది అమెరికా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: