కృష్ణా టీడీపీ నేత అడ్రస్ ఎక్కడ... కీలక సమయంలో కనిపించట్లేదే...!
ఇక, అప్పటి నుంచి అడపా దడపా కనిపిస్తున్నా.. రాజకీయంగా మాత్రం దూకుడు చూపించలేకపోతున్నారు. ముఖ్యంగా రెండు నెలల కిందట పార్టీలో పదవులు ఇచ్చినవారిలో బోడే ప్రసాద్ ఎక్కడా కనిపించలే దు. ఇక, చంద్రబాబుతోనూ బోడే ప్రసాద్‌కు రిలేషన్ అంతంత మాత్రంగానే ఉందనే ప్రచారం జరుగుతోం ది. అలాగని పార్టీమారే ఆలోచన ఆయనకు లేదని చెబుతున్నారు. ఇక, నియోజకవర్గంలోని తాడిగడప, కానూరు కేంద్రాలుగా బోడే ప్రసాద్‌కు వ్యతిరేకంగా తెరమీదికి వచ్చిన టీడీపీలోని రెండు వర్గాలు ఇప్పుడు దూకుడు చూపిస్తున్నాయి. బోడే ప్రమేయం లేకుండానే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ విషయంపై ఇప్పటికి రెండు సార్లు.. బోడే ప్రసాద్.. చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కానీ, బాబు ఈ విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామం బోడేకు రుచించడం లేదు. గతంలో తాను ఎక్కడికి వెళ్లినా.. వెంట ఉండే కార్యకర్తలు, చోటా నేతలు.. ఇప్పుడు ఫోన్లు చేసి పిలుస్తున్నా.. కనిపించడం లేదు. ఇక, తాజా విషయానికి వస్తే.. ఏటా సంక్రాంతి సంబరాలను బోడే ప్రసాద్ ఘనంగా నిర్వహించేవారు. ముఖ్యంగా కోడిపందేల బరులను భారీ ఎత్తున ఏర్పాటు చేసి.. సినీ వర్గాలను కూడా ఆహ్వానించేవారు.
కానీ, ఈ ఏడాది ఆయన ఈ సాహసం చేయలేకపోయారు. వాస్తవానికి గత ఏడాది వైసీపీ సర్కారు ఉన్నప్పటికీ.. బరులు వేశారు.కానీ, ఈ ఏడాది మాత్రం కేడర్ తగ్గిపోవడం, పార్టీలో తనకు అనుకూల పరిణామాలు లేకపోవడం, టీడీపీ నేతలపై కేసులు నమోదవుతున్నా.. పార్టీ తరఫున పెద్దగా స్పందన లేకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో బోడే అడ్రస్ లేకుండా పోయిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరిఇది ఇక్కడితో పరిమితం అవుతుందా? లేక.. మరికొన్నాళ్లు ఆయన మౌనంగానే ఉంటారా? అనేది చూడాలంటున్నారు పరిశీలకులు.