ఒక్కో ఎమ్మెల్యేల‌కు రు.25 కోట్లు... అంద‌రిని త‌న వైపుకే తిప్పుకున్న సీఎం...!

VUYYURU SUBHASH
క‌ర్నాక‌ట ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప ఓ మెట్టు కింద‌కు దిగి వ‌చ్చారు. త‌న‌పై గ‌రంగ‌రంగా ఉన్న ఎమ్మెల్యేల‌ను కాస్త కూల్ చేశారు. నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ధి కోసం ఆయ‌న ఎమ్మెల్యేల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. ఒక్కో ఎమ్మెల్యేకు రు. 25 కోట్ల రూపాయ‌ల నిధులు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న చేశారు. గ‌త కొద్ది రోజులుగా క‌ర్నాట‌క‌లో య‌డ్యూర‌ప్ప సీఎం పీఠం నుంచి దిగిపోతార‌ని.. ఓ యువ‌నేత‌ను అక్క‌డ సీఎం పీఠంపై కూర్చోపెట్టేందుకు బీజేపీ అధిష్టానం ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. య‌డ్డీకి వ‌య‌స్సు పై బ‌డ‌డంతో పాటు ఆయ‌న‌కు ఇంకా ప‌ద‌విలో కొన‌సాగ‌డం ప‌ట్ల చాలా మంది పార్టీ నేత‌లు, ఎమ్మెల్యేలు వ్య‌తిరేక‌త‌తో ఉన్నార‌న్న ప్ర‌చారం న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే.
ఇక య‌డ్యూర‌ప్ప ఎమ్మెల్యేల‌ను త‌న వైపున‌కు తిప్పుకునేందుకు ఆయ‌న  ఒక్కో ఎమ్మెల్యేకు.. వారి నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ధికి రు. 25 కోట్ల నిధులు జారీ చేస్తాన‌ని చెప్ప‌డంతో వాళ్లంతా కూల్ అయ్యారు. య‌డ్యూర‌ప్ప ఇచ్చిన బంప‌ర్ ఆఫ‌ర్‌తో నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆయ‌న్ను ప‌ద‌వి నుంచి దింపేయాల‌ని చూసిన నేత‌లు అంద‌రూ సైలెంట్ అయిపోయారు. కొద్ది రోజులుగా చాలా మంది సొంత పార్టీ ఎమ్మెల్యేల‌కే అపాయింట్ మెంట్ ఇవ్వ‌ని ఆయ‌న త‌న ప్రాప‌కం ఉన్న కొంద‌రు నేత‌ల‌కే నిధులు ఇస్తూ మిగిలిన వారిని పూర్తిగా ప‌క్క‌న పెట్టేస్తూ వ‌చ్చారు.
దీంతో య‌డ్యూర‌ప్ప‌ను వ్య‌తిరేకించే ఎమ్మెల్యేల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోయింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఇటీవ‌ల 118 మంది బీజేపీ ఎమ్మెల్యేల‌తో ఓ స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌తి ఒక్క ఎమ్మెల్యే స‌మ‌స్య‌ను ఓపిగ్గా విన్న ఆయ‌న చివ‌ర‌కు మ‌న‌మంద‌రం ఒకే మాట మీద నిల‌బ‌డ‌దాం అని వారికి సూచించ‌డంతో పాటు వారి స‌మ‌స్య‌లు తీర్చేందుకు కూడా అంగీకారం తెలిపారు. క‌రోనాతో పాటు వ‌ర‌ద‌ల కార‌ణంగానే తాను ఇప్ప‌టి వ‌ర‌కు నిధులు విడుద‌ల చేయ‌లేక‌పోయాన‌ని చెప్పిన ఆయ‌న ఇప్పుడు ఒక్కొక్క‌రికి రు. 25 కోట్లు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న చేశారు.
ఇక అధిష్టానం సైతం య‌డ్డి తీరుపై గుస్సాతో ఉన్న వేళ ఆయ‌న వేసిన మంత్రంతో క‌ర్నాక‌ట బీజేపీ రాజ‌కీయం తిరిగి య‌డ్డీకి అనుకూలమ‌య్యే ప‌రిస్థితి ఉంది. మ‌రి అధిష్టానం మ‌రో రెండేళ్లు ఆయ‌న్నే ముఖ్య‌మంత్రిగా కొన‌సాగిస్తుందా ? అన్న‌ది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: