దేశంలో మొదటి టీకా వేసుకున్నది ఎవరో తెలుసా

Malathiputhra
కరోనా పోరులో భాగంగా   వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శనివారం భారత్ శ్రీకారం చుట్టింది. ఈ  కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. మొత్తం 3,006 కేంద్రాల్లో టీకా పంపిణీ చేపట్టగా.. దేశంలోనే తొలి వ్యాక్సిన్ రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు చెందిన సుధీర్ భండారీ తీసుకున్నారు. ఆయనకు ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా  కోవీషీల్డ్‌ తొలి డోస్ వేశారు.
ఇక, తొలి రోజు ఒక్కో కేంద్రంలో 100 మందికి టీకా ఇవ్వనున్నట్టు పీఎంవో తన ప్రకటనలో వెల్లడించింది. తొలి దశలో వైద్య సిబ్బందికి టీకా అందజేయనున్నారు. 
ఇక రెండో దశలో మిగతా మందికి టీకా ఇవ్వనున్నట్టు ప్రధాని మోదీ తెలియజేశారు. , ప్రజలందరు కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మోదీ సూచించారు 
దేశంలో రెండు టీకాలు అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఆమోదం తెలిపింది. మొదటి  దశలో కోవిషీల్డ్ డోస్‌లను అధికంగా, భారత్ బయోటెక్ కొవాగ్జిన్ డోస్‌లు నామమాత్రంగానే వినియోగిస్తున్నారు.  తొలి డోస్‌ ఇచ్చిన తర్వాత.. రెండో డోస్‌ను నెల రోజుల తర్వాత అందజేయనున్నారు.  ప్రతి రాష్ట్రంలోనూ టీకా పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.. అలాగే డివిజన్‌స్థాయి, జిల్లాస్థాయి నిల్వ కేంద్రాలను ఏర్పాటుచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: