శత్రు దేశానికి భారత్ వ్యాక్సిన్.. ఇది కదా విజయం అంటే..?

praveen
ప్రస్తుతం భారత్ పై ఆధిపత్యం సాధించాలి అనుకున్న చైనా దీనికోసం భారత్ చుట్టూ ఉన్న దేశాలను  తమ వైపుకు తిప్పుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్థిక సహాయం ఆశ  చూపి అటు భారత్ కు  సోదర దేశంగా  కొనసాగుతున్న నేపాల్ ను తనవైపుకు తిప్పుకుని.. భారత్ పైన యుద్ధం చేసేందుకు సిద్ధమయ్యే  పరిణామాలను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే నేపాల్ ప్రధానమంత్రి వోలీ శర్మ భారత్ గురించి ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది అన్న విషయం తెలిసిందే.

 అయితే ప్రస్తుతం పలు దేశాలు చైనాకు మిత్ర దేశాలుగా కొనసాగుతున్నప్పటికీ వ్యాక్సిన్ విషయంలో మాత్రం అస్సలు చైనా ను  నమ్మడం లేదు. అన్ని దేశాల కంటే చైనా ముందుగా వ్యాక్సిన్  తీసుకొచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చైనా  మిత్ర దేశాలు చైనా వ్యాక్సిన్ ను  తమ దేశంలో అనుమతి కూడా ఇచ్చారు కానీ ఆ తర్వాత తలెత్తిన  దుష్ప్రభావాలు దృశ్య  మిత్ర దేశం అయినప్పటికి కూడా చైనా వ్యాక్సిన్ ను బ్యాన్  చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇక ఇటీవల నేపాల్ కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చైనాతో స్నేహం చేసి భారత్ కు  వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన నేపాల్ ప్రభుత్వం  ఇప్పుడు వ్యాక్సిన్  కోసం మళ్ళీ భారత్ పైన ఆధారపడుతూ ఉంది.

 ఏకంగా  చైనా వ్యాక్సిన్ ను కాదని భారత్ కు  చెందినటువంటి వ్యాక్సిన్ ను  నేపాల్లో అత్యవసర వినియోగానికి అనుమతిస్తూ నేపాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంటనే భారత్ తమకు వ్యాక్సిన్  సప్లై చేయాలి అంటూ నేపాల్ కోరింది. దీనికి సంబంధించి ఇటీవలే నేపాల్ ఆరోగ్య శాఖ మంత్రి భారత్ వచ్చి ఢిల్లీ పెద్దలతో సమావేశమై ఈ విషయాన్ని మరోసారి కోరడం జరిగినట్లు తెలుస్తోంది. ఇలా మొన్నటి వరకు భారత్ తమ శత్రుదేశం అనేలా  వ్యవహరించిన నేపాల్ ప్రభుత్వం ఇప్పుడు మాత్రం మళ్ళీ స్నేహబంధాన్ని కొనసాగించేందుకు సంకేతాలు ఇస్తోంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: