సూర్యోదయం తర్వాత కూడా నిద్రిస్తే ఏమి జరుగుతుందో తెలుసా..!?

N.ANJI
నేటి సమాజంలో చాల మంది సూర్యోదయం దాటినా తరువాత కూడా నిద్రపోయే అలవాటు ఎక్కువగా ఉంది. అయితే ఆయుర్వేద చికిత్సా విధానంలో తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర మేల్కొన్నప్పటి నుండి, రాత్రి పడుకునే వరకు సమయాన్ని ఎలా గడపాలి, దీని కొరకు మనిషి తన దినచర్యను ఎలా రూపొందించుకోవాలి అనేది ఇందులో ప్రధాన అంశాలు.

ఇక సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనుకునే వారు ప్రాతఃకాలం బ్రహ్మ ముహూర్తం లోనే నిద్ర లేవాలి. సూర్యోదయానికి  ముందు అంటే దాదాపుగా 2-3గంటల ముందు ఉండే సమయాన్ని బ్రహ్మ మూహూర్తంగా చెప్తారు. ఇక ఆ సమయంలో చాలా ఆహ్లాదంగా, ప్రశాంతంగా, ఉంటుంది. రోజూ ఆ సమయంలో నిద్ర లేవడం వల్ల మానసిక, శారీరిక, ఆధ్యాత్మికపరంగా ఎంతో అభివృద్ధిని సాధించడానికి ఎంతో అనువైన సమయం. వ్యాయామం,భగవధ్యానం, సత్ గ్రంధ పఠనం, వంటివి చేయడంవలన అన్ని విధాలుగానూ అభ్యున్నతిని పొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

అంతేకాక ఈ సమయంలో నిద్రలేచే వారు ఎప్పుడు ఆరోగ్యవంతులుగా ఉంటారు. విద్య, తేజస్సు, బలం, ధనం ఎప్పుడు సమృద్ధిగా ఉంటాయని తెలిపారు. సూర్యోదయం తర్వాత కూడాఎవరైతే నిద్రపోతుంటారో వారి  శరీరంలోని శక్తి నశించడం తో పాటు,ఆయుష్షు క్షీణిస్తుంది.ఇలాంటి వ్యక్తులు రకరకాల జబ్బుల తో బాధపడక తప్పదని ఆయుర్వేద వైద్యం వెల్లడిస్తుంది.

అయితే నిద్ర లేచిన తర్వాత మలమూత్రాదులను విసర్జించే ముందుగా చల్లటి నీటిని తాగాలి. ఇక రాత్రి పడుకునే ముందు ఒక  రాగి పాత్రలో నీటిని నింపి నిల్వ చేసుకోవాలని తెలిపారు. అయితే నిద్ర లేచిన తర్వాత ఆ నీటిని తాగితే ఆరోగ్యంగా ఉంటారు. నిద్ర లేచిన తర్వాత కనీసం అరలీటరు వీలైతే ఒక లీటరు నీటిని తాగితే ఆరోగ్యానికి మరీ మంచిదంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ఇలా నీటిని తాగడం వలన శరీరంలోనున్న వాయు, కఫం, పిత్త దోషాలు పోతాయి. దీంతో మనిషి బలశాలి, దీర్ఘ ఆయుఃషుతో బ్రతుకుతాడు. ఉదరం అంతా పూర్తిగా శుభ్రం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: