మహారాష్ట్రలో వ్యాక్సినేషన్ కు బ్రేక్... ఎందుకో తెలుసా..?
ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కానీ ఒక్క రోజులోనే వ్యాక్సినేషన్ ప్రక్రియకు మహారాష్ట్రలో బ్రేక్ పడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. అదేంటి మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత అన్ని రాష్ట్రాలలో కంటే ఎక్కువగా ఉంది కదా.. మరి అక్కడ వాక్సినేషన్ ప్రక్రియ కు ఒక్కరోజులోనే బ్రేక్ పడటం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు కదా. దీని వెనుక కారణం కూడా లేకపోలేదు.
కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి అనుకుంటున్న వారు తమ పేరు నమోదు చేసుకోవడానికి కోవిన్ అనే ఆన్లైన్ అప్లికేషన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ లో సాంకేతిక సమస్యలు తలెత్తిన కారణంగా ఎంతోమంది వ్యాక్సిన్ కోసం తమ పేరును నమోదు చేసుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే శనివారం ప్రారంభమైన వాక్సినేషన్ ప్రక్రియను 18వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఈ సాంకేతిక సమస్య ముగియగానే వెంటనే.. ప్రజలు కోవిన్ యాప్ లో వ్యాక్సిన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ సూచించారు అధికారులు.