బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. వామ్మో.. మటన్ ధర ఇంత పెరిగిందేంటి..?

praveen
ఈ మధ్యకాలంలో మాంసం ప్రియులు రోజురోజుకు ఎక్కువవుతున్నారు  అన్న విషయం తెలిసిందే. కొంతమందికి  అయితే ఏకంగా ప్రతి రోజూ తినే ఆహారంలో మాంసం ఉండాల్సిందే.  ముక్క లేనిదే ముద్ద దిగదు అన్న విధంగా మారిపోతుంది పరిస్థితి. కొంతమంది వారంలో రెండు మూడు సార్లు మాంసాన్ని తినక పోతే ఇక సంతృప్తిగా ఉండరు. దీంతో మాంసానికి గిరాకీ రోజు రోజుకు పెరిగిపోతుంది అన్న విషయం తెలిసిందే.  సాధారణంగా ఎక్కువగా ప్రజలు చికెన్, మటన్ లాంటివి తింటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే మార్కెట్లో ఈ రెండు రకాల మాంసానికి ఎంతో డిమాండ్ భారీగా ఉంటుంది.  కానీ ఈ మధ్య కాలంలో చికెన్ కి డిమాండ్ అంతకంతకూ పడిపోతున్న నేపథ్యంలో మటన్ ధర అంతకంతకూ పెరిగిపోతోంది.



 ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ శరవేగంగా విస్తరిస్తూ ఎన్నో కోళ్లు, పక్షులు చనిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో రాష్ట్రాలు కోళ్లు, గుడ్లకు  కూడా దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా కోళ్లు, గుడ్లు పై నిషేధం కూడా విధిస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు.  ఈ క్రమంలోనే చికెన్ మాంసానికి భారీగా డిమాండ్ తగ్గిపోయింది.  బర్డ్ ఫ్లూ  నేపథ్యంలో అటు మాంసం ప్రియులు ఎక్కువగా చికెన్ కొనుగోలు చేయడానికి కాకుండా మటన్ తినడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే మార్కెట్లో మటన్ కి భారీగా డిమాండ్ పెరిగిపోయింది.



 ముఖ్యంగా ఈ పండుగ సీజన్లో తెలుగు రాష్ట్రాల్లో అయితే మటన్ కి గిరాకి  పెరిగిపోవడంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అని చెప్పాలి. కొన్ని రోజుల నుంచి మేక, గొర్రె మాంసం తినడానికి ఎక్కువగా ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీంతో మటన్ ధర అమాంతం పెరిగిపోయింది. కేవలం నెలరోజుల వ్యవధిలోనే మటన్ ధర 600 రూపాయల నుంచి 750 రూపాయలు వరకు వెళ్ళింది. ఇక కొన్ని ప్రాంతాలలో అయితే మటన్ కిలో ధర వెయ్యి రూపాయల వరకు పలికినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కనుమ పండుగ రోజు అయితే హైదరాబాదులో మూడు లక్షల కిలోల మాంసం విక్రయించినట్లు తెలుస్తోంది. భారీగా పెరిగిన మటన్ ధరలు ప్రస్తుతం సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: