యూట్యూబ్ లో అది చూసి.. చివరికి ఎంత పని చేశారు..?
ఇక మరి కొంతమంది యూట్యూబ్ లో వీడియోలు చూసి దొంగతనాలు ఎలా చేయాలి అని ట్రైనింగ్ తీసుకుని.. అంతేకాకుండా పోలీసులకు దొరకకుండా ఎలా ఉండాలి అనేదానిపై ఎంతో పకడ్బందీగా యూట్యూబ్ వీడియోలు చూసి ఆ తర్వాత దొంగతనాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా తెర మీదకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్ లో చూసి దొంగతనాలకు పాల్పడ్డారు కొంతమంది అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు. కానీ ప్లాన్ కాస్త బోల్తా కొట్టి చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు.
ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. బీదర్ కు చెందిన వాజిత్ అనే 19 ఏళ్ల యువకుడు ఉపాధి కోసం రెండేళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చాడు. ఇక పాత నేరస్తుడు అయిన అబ్దుల్ సమీర్ తో ఒక ముఠా ఏర్పాటు చేసుకొని.. నేరాలు చేయడం మొదలు పెట్టాడు. ఇక జనవరి 3న జగదీష్ మార్కెట్ లోని మహాలక్ష్మి ఆలయంలో చోరీ జరగగా దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందుకున్నారు. ఇక ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు.. ముమ్మర దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలోనే సాజిద్ సహ మిగతా ముఠా సభ్యులు చోరీలు చేస్తున్నారని విచారణలో తేలడం తో.. ముగ్గురు సభ్యులను పట్టుకున్న పోలీసులు.. మరో ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.