రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. ఇక మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు..?

praveen
సాధారణంగా ప్రజలు రైల్వే ప్రయాణాలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  రైల్వే ప్రయాణాలు సేఫ్ అని భావించడమే కాదు అటు అతి తక్కువ ధరకే రైల్వే ప్రయాణాలు చేసేందుకు అవకాశం ఉంటుంది. అంతే కాకుండా సుదూర ప్రాంతాలకు వెళ్లాలి అంటే రైల్వే ప్రయాణాలు ఎంతో బెటర్ అన్న విషయం తెలిసిందే. అందుకే ఎంతోమంది రైల్వే సర్వీసులను ఆశ్రయించి ప్రయాణాలు చేస్తూ ఉంటారు.  ఇక భారత రైల్వే విషయంలో అటు రైల్వే శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటూ రైల్వే ప్రయాణికుల అందరికీ ఉపయోగపడే విధంగా చర్యలు చేపడుతుంది అన్న విషయం తెలిసిందే.


 ఒకవేళ మీరు ఎక్కువగా రైల్వే ప్రయాణికులు చేస్తూ ఉంటే ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయం మీకు ఒక తీపి కబురు అని చెప్పాలి.  ఇండియన్ రైల్వేస్ మళ్ళీ  ఈ-క్యాటరింగ్ సర్వీసులను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. సాధ్యత, సిబ్బంది లభ్యత, స్థానిక పరిస్థితులపై ఆధారపడి మళ్లీ ఈ-కేటరింగ్ సేవలను ప్రారంభించే  యోచనలో భారత రైల్వే శాఖ ఉంది అని ప్రస్తుతం అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా తొలుత ఎంపిక చేసిన రైల్వేస్టేషన్లలో మాత్రమే ఈ ఫుడ్ డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు నిర్ణయించారు.



 అయితే రెల్ రెస్టో  సీఈవో మహేష్ చంద్ర రైల్వే శాఖ ఐఆర్ సిటిసి అధికారులకు లేఖ రాసిన నేపథ్యంలోనే ఈ సేవలు ప్రారంభానికి ప్రకటన విడుదల అయినట్లు తెలుస్తోంది.  జనవరి చివరి వారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా రెస్టారెంట్ పార్ట్నర్స్ అందరూ కూడా కాంటాక్ట్ లెస్ డెలివరీ చేయాలని ప్రస్తుతం అధికారులు కోరుతున్నట్లు తెలుస్తోంది. పిఎన్ఆర్ నెంబర్,  ట్రైన్ పేరు,సీటు వివరాలు వంటివి ఎంటర్ చేసి మీకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ ఇవ్వొచ్చు.  అయితే గతంలో ఐ ఆర్ సి టి సి ఇలాగే ఈ-క్యాటరింగ్ సర్వీస్ను అందుబాటులోకి తీసుకువచ్చింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: