తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ కి అస్త్రం అదేనట..?
అన్ని పార్టీ లు ఇక్కడి ఎన్నికలకు సమాయత్తం అవుతున్న సమయంలో అయితే గత ఎన్నికల మాదిరిగా టీడీపీ ఇప్పుడు ప్రచారానికి దిగట్లేదని తెలుస్తుంది.. గత ఎన్నికల సమయంలో టీడీపీ అభివృద్ధి చేస్తామనే, బ్రతుకులు మార్చేస్తామనో ఇలా వివిధ రకాలుగా వారు ప్రచారం చేసేవారు.. కానీ తిరుపతి ఉప ఎన్నికలో ఇలాంటివేవీ ఉండవట.. హిందుత్వాన్ని అడ్డుపెట్టుకుని ప్రచారం చేస్తుందట.. ప్రచారం మొత్తంలో ఇతర ప్రచారాలతో పాటు హిందూ ధర్మాన్నే హైలెట్ చేసుకోవాలని నిర్ణయించింది.ఈ నెల 21 నుండి తిరుపతి పార్లమెంట్ పరిధిలో ధర్మపరిరక్షణ యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తిరుపతిలో ప్రారంభిస్తారు.
దేవాలయాల పరిరక్షణే ధ్వేయంగా ప్రతి నియోజకవర్గంలో 10 ప్రచార రథాలతో ధర్మపరిరక్షణ యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు రథాలను కూడా సిద్ధం చేసుకున్నారు. పేరుకు ధర్మపరిరక్షణ అని చెప్పినా… ఎన్నికల ప్రచారం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు రామతీర్థానికి వచ్చి వెళ్లిన తరువాత తిరుపతి వారి ప్రచార వ్యూహం మారినట్లు తెలుస్తుంది. ఏపీ లో క్రిస్టియన్ ప్రభుత్వం నడుస్తోందన్న భావన ప్రజల్లో కల్పించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు టీడీపీ నేతలు.. సీఎం, హోంమంత్రి, డీజీపీ ఇలా.. అందరూ క్రిస్టియన్సే ప్రధాన పదవుల్లో ఉన్నారని అంటున్నారు. మరి ఈరకమైన ప్రచారం టీడీపీ ఏవిధంగా ఉపయోగపడుతుందో చూడాలి..